శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 నవంబరు 2019 (15:27 IST)

నో డౌట్... ప్రజ్ఞా సింగ్ ఓ ఉగ్రవాది : రాహుల్ గాంధీ

బీజేపీ ఎంపీగా కొనసాగుతున్న ప్రజ్ఞా సింగ్‌పై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. జాతిపిత మహాత్మా గాంధీని హత్యచేసిన గాడ్సే దేశభక్తుడంటూ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ రెండు రోజుల క్రితం లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రాహుల్ తీవ్రంగా మండిపడ్డారు. 
 
ప్రజ్ఞా సింగ్ కూడా ఓ ఉగ్రవాదని ఆరోపించారు. ట్విట్టర్ వేదికగా ప్రజ్ఞా సింగ్‌ను విమర్శించారు.  ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ద్వారా అరెస్సెస్, బీజేపీ నేతల మనసులోని మాటే బయటకు వచ్చిందన్నారు. 'ఉగ్రవాది ప్రజ్ఞా సింగ్.. ఉగ్రవాది అయినా గాడ్సేను దేశభక్తుడని అన్నారు. పార్లమెంట్ చరిత్రలో ఇదో దుర్దినం' అని ట్వీట్ చేశారు. 
 
ప్రజ్ఞాపై బీజేపీ వేటు.. 
నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్‌పై కమలనాథులు కన్నెర్రజేశారు. జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడంటూ వ్యాఖ్యానించినందుకు ఆమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. 
 
ముఖ్యంగా, దేశ పార్లమెంట్‌లో ప్రజ్ఞా సింగ్ మాట్లాడుతూ, జాతిపిత మహాత్మగాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సే దేశ భక్తుడని బుధవారం లోక్‌సభలో ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యానించారు. దీంతో సభలో విపక్ష సభ్యులు బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆ వెంటనే అప్రమత్తమైన కమలనాథులు... ప్రజ్ఞాసింగ్‌ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు బీజేపీ ప్రకటించింది. అంతేకాకుండా, 
 
రక్షణశాఖపై ఏర్పాటుచేసిన పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ నుంచి అమెను తొలగిస్తున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ. నడ్డా ప్రకటించారు. అంతేకాక ఈ విడత జరుగుతున్న పార్లమెంటరీ పార్టీ సమావేశాల నుంచి కూడా ప్రజ్ఞా సింగ్‌ను దూరంగా ఉంచుతున్నట్లు పేర్కొన్నారు.