1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. TDP Chief Chandrababu Naidu Question State policing

అర్థరాత్రి ఠాణా వద్ద ధర్నా... రాష్ట్రంలో పోలీసింగ్ ఉన్నట్టా లేనట్టా?

Chandrababu Naidu
రాష్ట్రంలో వైకాపా ఎమ్మెల్యేలు సాగిస్తున్న అక్రమాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా నిలదీశారు. నెల్లూరు రూరల్ వైకాప ఎమ్మెల్యే ఓ మహిళా అధికారిపై దౌర్జన్యం చేయడాన్ని ఆయన నిలదీశారు. 
 
తన విధి నిర్వహణలో నిజాయితీగా ఉన్నందుకు ఒక మహిళా అధికారిణిపై వైకాపా ఎమ్మెల్యే ఒకరు దౌర్జన్యం చేశారు. తనకు న్యాయం చేయాలని అర్థరాత్రి వేళ ఆ మహిళాధికారి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే కేసు తీసుకోడానికే జంకారంటే, ఈ రాష్ట్రంలో పోలీసింగ్ ఉన్నట్టా లేనట్టా? 
 
వైసిపి నేతలు చెప్పిన అక్రమాలు చేయకపోతే మహిళలని కూడా చూడరా..? ఆమె ఇంటికి కరెంట్ కట్ చేస్తారా? నీటి కనెక్షన్ కట్ చేస్తారా? ఇంటి ముందే చెత్తకుండీ పెడతారా? టివి కేబుల్స్ తెంపేస్తారా? ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? ముఖ్యమంత్రికి ఇవేమీ కనబడవా? 
 
ఇదే ఎమ్మెల్యే గతంలో ఒక ముస్లిం మైనారిటి జర్నలిస్టును ఫోనులో చంపుతానని బెదిరించారు. ఇదే ఎమ్మెల్యే గతంలో జమీన్ రైతు సంపాదకుడిపై దౌర్జన్యం చేశారు. ఒక మహిళా డాక్టర్ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. అప్పుడే ప్రభుత్వం చర్య తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా? అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
మోసం కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ అరెస్టు??