1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. TDP MLC Rajendra prasad fires on Narendra modi and Jagan

చంద్రబాబు బాహుబలి ఐతే.. మోదీ భళ్లాలదేవుడు.. ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

ఏపీ సీఎం చంద్రబాబును బాహుబలిగా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని భళ్లాలదేవుడిగా టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అభివర్ణించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు వైసీపీపై నిప్పులు చెరిగారు. ఏపీ ప్రజలు భా

TDP MLC
ఏపీ సీఎం చంద్రబాబును బాహుబలిగా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని భళ్లాలదేవుడిగా టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అభివర్ణించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు వైసీపీపై నిప్పులు చెరిగారు. ఏపీ ప్రజలు భారతదేశంలో భాగం కాదా అంటూ మోదీకి రాజేంద్ర ప్రసాద్ సూటి ప్రశ్న సంధించారు. చంద్రబాబుపై మోదీ ఎన్ని కుట్రలు పన్నినా తిప్పికొడతామని.. తమ డిమాండ్లు, ఆందోళనలపై మోదీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
 
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రకు ప్రజల ఆదరణ కరువైందని రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. జనాలు సభకు రాలేదని పార్టీ ఎమ్మెల్యేలకు, నేతలకు జగన్ గట్టిగా క్లాస్ పీకారని తీసుకున్నట్టు తనకు తెలిసిందని చెప్పారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లడం కాదు.. వైసీపీ నుంచే టీడీపీలో చేరేందుకు చాలా మంది నేతలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. 
తర్వాతి కథనం
మళ్లీ కన్నుగీటిన ప్రియా ప్రకాష్ వారియర్... యాడ్ వీడియో వైరల్