శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By srinivas
Last Updated : బుధవారం, 11 ఏప్రియల్ 2018 (09:55 IST)

రేపు ప్ర‌ధాని నరేంద్ర మోడీ ఉప‌వాస దీక్ష‌

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం దీక్ష చేయనున్నారు. గురువారం రోజంతా పచ్చి మంచినీరు కూడా ముట్టకుండా ఉపవాస దీక్ష చేయనున్నారు. ఇంత‌కీ ఈ దీక్ష ఎందుకంటే.. ఇటీవల ముగిసిన పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలను ప్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం దీక్ష చేయనున్నారు. గురువారం రోజంతా పచ్చి మంచినీరు కూడా ముట్టకుండా ఉపవాస దీక్ష చేయనున్నారు. ఇంత‌కీ ఈ దీక్ష ఎందుకంటే.. ఇటీవల ముగిసిన పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలను ప్రతిపక్షాలు స్తంభింపజేసినందుకు నిరసనగా ఈ ఉపవాస దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ ఎంపీలతో కలిసి ఆయన ఈ దీక్ష చేయనున్నారు. 
 
అయితే, ఆయ‌న దీక్ష చేసినా.. రోజువారీ విధులకు ఆటంకం కలగకుండానే ఆయన చేస్తారని, ఫైళ్ల క్లియరెన్స్‌ యధావిధిగా ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. అలాగే కర్ణాటకలోని హుబ్లీ పర్యటనలో ఉండనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కూడా అక్కడే తన ఉపవాస దీక్షను కొనసాగించనున్నారు. 
 
పార్లమెంటును కాంగ్రెస్‌ స్తంభింపజేసినందుకు నిరసనగా ఈనెల 12వ తేదీన బీజేపీ ఎంపీలు ఉపవాస దీక్ష చేస్తారని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, తాను కూడా దీక్షలో కూర్చుంటున్నానని మంగళవారం ఆయన ప్రకటించారు. ఇక, బీజేపీ ఎంపీలంతా వారి నియోజకవర్గాల్లో ఈ దీక్షలో పాల్గొననున్నారు. మ‌రి.. ప్ర‌ధాని దీక్ష గురించి ప్ర‌తిప‌క్షం ఎలా స్పందిస్తుందో చూడాలి.