1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Congress Leaders seen feasting before their fast in Rajghat

కాంగ్రెస్ నిరాహారదీక్షలు... కడుపునిండా పూరీలు ఆరగించిన నేతలు

దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం దేశ వ్యాప్తంగా నిరాహారదీక్షలు జరిగాయి. అయితే, ఈ దీక్షలో పాల్గొనే ముందు పలువురు కాంగ్రెస్ నేతలు కడుపునిండా పూరీలు లాంగించి దీక్షల

Congress Leaders
దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం దేశ వ్యాప్తంగా నిరాహారదీక్షలు జరిగాయి. అయితే, ఈ దీక్షలో పాల్గొనే ముందు పలువురు కాంగ్రెస్ నేతలు కడుపునిండా పూరీలు లాంగించి దీక్షలో కూర్చొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇపుడు వైరల్ అయ్యాయి. 
 
ముఖ్యంగా, ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద జరిగిన ఈ నిరసన దీక్షకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హాజరయ్యారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ తీరుకి నిరసనగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ నేతలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అయితే, పలువురు కాంగ్రెస్ నేతలు రాజ్‌ఘాట్‌లో నిరాహార దీక్షకి వెళ్లే ముందు హోటల్‌లో పూరీలు లాగిస్తూ మీడియా కంటపడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
 
ఈ ఫొటో బయటకు రావడంతో కాంగ్రెస్ నేత అరవింద్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ... తాము చేసేది ఒక్కరోజు దీక్ష అని, ఈ రోజు ఉదయం 10.30 నుంచి సాయత్రం 4.30 వరకు ఉంటుందని, తాము ఉదయం 8 గంటల ముందే తప్పేంటని ప్రశ్నించారు. బీజేపీ నేతలు దేశాన్ని సమర్థవంతంగా పాలించే అంశంపై దృష్టి పెట్టకుండా, తాము ఏం తింటున్నామనే విషయంపై దృష్టి పెట్టారని విమర్శించారు.  
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
భార్య ఆస్తి కాదు.. ఓ వస్తువు కాదు.. ఇష్టం లేదంటే ఎలా జీవిస్తావ్?: సుప్రీం