గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శనివారం, 7 ఏప్రియల్ 2018 (10:53 IST)

హోదా కోసం ఢిల్లీలో ఆమరణ దీక్ష : ఎంపీ మేకపాటికి అస్వస్థత

ప్రత్యేక హోదా కోసం వైకాపా ఎంపీలు ఢిల్లీ వేదికగా చేసుకుని ఆమరణ నిరాహాదీక్షకు శుక్రవారం నుంచి శ్రీకారం చుట్టారు. ఈ దీక్ష శనివారానికి రెండోరోజుకు చేరుకుంది. అయితే, ఈ దీక్షలో పాల్గొన్న నెల్లూరు ఎంపీ మేకపా

ప్రత్యేక హోదా కోసం వైకాపా ఎంపీలు ఢిల్లీ వేదికగా చేసుకుని ఆమరణ నిరాహాదీక్షకు శుక్రవారం నుంచి శ్రీకారం చుట్టారు. ఈ దీక్ష శనివారానికి రెండోరోజుకు చేరుకుంది. అయితే, ఈ దీక్షలో పాల్గొన్న నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనకు వైద్యులు ప్రాథమిక వైద్య పరీక్షలు చేశారు. 
 
శనివారం తెల్లవారుజామున తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ ఆయన అస్వస్థతకు లోనయ్యారు. ఆయనను పరీక్షించిన వైద్యులు... నిరాహారదీక్షను విరమించాలని సూచించారు. అయినప్పటికీ దీక్షను విరమించేందుకు ఆయన నిరాకరించారు. 

ఐదుకోట్ల మంది ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ చేస్తున్న పోరాటం తుది అంకానికి చేరుకుంది. పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించారు. నాలుగేళ్లుగా పోరాడుతున్నా కేంద్రం మనసు కరగకపోవడంతో జగన్ ఆదేశం మేరకు ఆ పార్టీకి చెందిన ఎంపీలు రాజీనామాలు చేసిన విషయం తెల్సిందే.