శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (10:39 IST)

'నా పేరు సూర్య'గా అల్లు అర్జున్ ... మే 4న ప్రేక్షకుల ముందుకు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించే తాజా చిత్రం "నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా". ఈచిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఒక్క పాట మినహా మిగతా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించే తాజా చిత్రం "నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా". ఈచిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఒక్క పాట మినహా మిగతా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ఈ పాటను కూడా పూర్తిచేయనున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ గురించి బన్నీ అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 15వ తేదీన ఆడియో రిలీజ్ పెట్టుకుంటే బాగుంటుందని ఈ సినిమా దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అయితే, ఆ రోజు వీలుపడుతుందా లేదా అన్నదానిపై సందిగ్ధత ఇంకా వీడలేదు. 
 
మరోవైపు, ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌ ఎక్కడ నిర్వహించాలన్నదానిపై కూడా చర్చిస్తున్నారు. భాగ్యనగరంలో ఈ ఫంక్షన్ జరిపితే రొటీన్‌గా ఉంటుందనీ అందువల్ల వైజాగ్‌లో జరుపుదామని అనుకుంటే .. ఇంతకుముందే అక్కడ 'రంగస్థలం' ఫంక్షన్ జరిపారు. అందువలన అల్లు అర్జున్ చిత్రం ఆడియో  వేడుకను 'తిరుపతి'లోగానీ .. కర్నూల్‌లోగాని జరపాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ సంగతి పక్కనబెడితే చిత్రం మాత్రం మే 4వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది.