శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 28 మార్చి 2018 (15:04 IST)

పెళ్లిపీటలెక్కిన నితిన్ - రాశిఖన్నా... జూలై 27న ప్రేక్షకులకు కనిపిస్తారట...

హీరో నితిన్, హీరోయిన్ రాశి ఖన్నాలు పెళ్లిపీటలెక్కారు. నిజజీవితంలో మాత్రం కాదండోయ్. వీరిద్దరి కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు "శ్రీనివాస కళ్యాణం" అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్తి ఫ్యామిలీ

హీరో నితిన్, హీరోయిన్ రాశి ఖన్నాలు పెళ్లిపీటలెక్కారు. నిజజీవితంలో మాత్రం కాదండోయ్. వీరిద్దరి కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు "శ్రీనివాస కళ్యాణం" అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నారు. 
 
ఈ చిత్రం షూటింగ్‌లో భాగంగా, అచ్చం నిజ పెళ్లి తరహాలోనే పెళ్లితంతు సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ స్టిల్స్ చూసిన ప్రతి ఒక్కరూ నిజంగానే వీరిద్దరు పెళ్లి చేసుకున్నారా? అంటూ ప్రశ్నించుకోసాగారు. 
 
ఇప్పటికే తొలి షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న ఈ సినిమా, రెండో షెడ్యూల్‌కి రెడీ అవుతోంది. వచ్చేనెల 17వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ చండీఘర్‌లో జరగనుంది. కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాను, జూలై 24వ తేదీన రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు.