శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (11:15 IST)

హఫీజ్ సయీద్ అమెరికా షాక్... ఎంఎంఎల్ నేతలపై ఉగ్రముద్ర

జమాత్‌-ఉద్‌-దవా (జేయూడీ) అధినేత, పేరమోసిన అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు అమెరికా తేరుకోలేని షాక్ ఇచ్చింది. ఆయన సారథ్యంలోని జేయూడీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.

జమాత్‌-ఉద్‌-దవా (జేయూడీ) అధినేత, పేరమోసిన అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు అమెరికా తేరుకోలేని షాక్ ఇచ్చింది. ఆయన సారథ్యంలోని జేయూడీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అలాగే, ఆయన స్థాపించిన రాజకీయ  పార్టీ మిల్లి ముస్లిం లీగ్ (ఎంఎంఎల్)లో కీలక పాత్ర పోషిస్తున్న ఏడుగురు నేతలపై కూడా అమెరికా ఉగ్రవాదులుగా ప్రకటించారు.
 
నిజానికి మిల్లి ముస్లిం లీగ్‌ (ఎంఎంఎల్‌) పార్టీని స్థాపించి పాకిస్థాన్‌ ఎన్నికల్లో సత్తాచాటాలని సయీద్ భావిస్తున్నారు. అయితే, పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో మిల్లి ముస్లిం లీగ్‌ పార్టీ పోటీ చేసేందుకు హోం శాఖ అనుమతి తీసుకోవాలని పాకిస్థాన్ ఎలక్షన్ కమిషన్ (పీఈసీ) ఇప్పటికే ఆదేశించింది. ఈ నేపథ్యంలో అమెరికా తేరుకోలేని షాక్ ఇచ్చింది. 
 
అలాగే, కాశ్మీర్‌లో లష్కర్‌-ఏ-తాయిబా (ఎల్‌ఈటీ) నడుపుతున్న తెహ్రిక్‌-ఈ-ఆజాదీ-ఈ-కశ్మీర్‌ (టీఏజేకే)ను కూడా ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్లు ఆ ప్రకటనలో అమెరికా స్పష్టం చేసింది. దీంతో ఎంఎంఎల్‌కు భారీ షాక్ తగిలినట్టయింది.