సోమవారం, 18 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By దేవీ
Last Updated : శనివారం, 7 జూన్ 2025 (09:45 IST)

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

AM Ratnam - Pawan
AM Ratnam - Pawan
పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా కథకు మొదట దర్శకుడు క్రిష్ ఆధ్వర్యంలో షూటింగ్ కొొంత భాగం జరిగింది. నాలుగేళ్ళ నాడే రెండు అపశ్రుతులు జరిగాయి. ఒకసారి సెట్ కాలిపోవడం, మరోసారి కూలిపోవడం జరగడంతో ఆ తర్వాత క్రిష్ చిత్రం నుంచి తప్పుకున్నాడని సమాచారం. అనంతరం పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం, ఎన్నికలు హడావుడి గెలవడం వంటి సంఘటనలు జరగడంలో ఇక తప్పని పరిస్థితుల్లో నిర్మాత ఎ.ఎం.రత్నం తనకుమారుడు జ్యోతి క్రిష్ణకు అంతకుముందు అనుభవం వుండడంతో ఆయన్నే దర్శకుడిగా పెట్టుకున్నారు.
 
కాగా, ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే, కథానాయకుడు ఉదయ్ కిరణ్ మంచి ఫామ్ లో వుండగానే ఆయనతో ఎ.ఎం. రత్నం పొయిటిక్ గా ఓ టైటిల్ పెట్టి సినిమాకు సన్నదం చేశారు. ఓపెనింగ్ వరకు వెళ్ళింది. కాగా, ఆ తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల ఆ సినిమా అటకెక్కింది. ఆ టైంలోనే పవన్ తో సినిమా చేయాలని రత్నం సిద్ధమయ్యారు. ఆయన పవన్ కు అడ్వాన్ కూడా ఇచ్చేశారు. ఎందుకనో అది కూడా సెట్ కాలేదు. అప్పట్లోనే కథ కొలిక్కిరాకపోవడంతో అలా సంవత్సరాలు వాయిదా పడుతూ ఇప్పుడు ఐదేళ్ళ క్రితం హరిహరవీరమల్లు సినిమా పవన్ కు సెట్ అయింది. అప్పటినుంచి చూసుకుంటే రత్నం ఎంతగానో ఖర్చు చేశారు. ఇదంతా హరిహరతో.. రాబట్టుకోవాలని చూసినా విడుదల ఆలస్యంతో మళ్ళీ బ్రేక్ పడింది. దాంతో ఒకసారి ఆయన తన జాతకాన్ని చూయించుకోవాలని సన్నిహితులు సూచించినట్లు టాక్ నెలకొంది.
 
అప్పట్లో సనాతన ధర్మం లేదు
ఇక టెక్నికల్ వల్ల సినిమా వాయిదా పడిందనేది బయట మాటేనా, ఇంకా ఏదైనా వుందా? అనే కోణంలో కూడా వినిపిస్తుంది. అసలు కథలో చాలా మార్పులు జరిగాయనే తెలుస్తోంది. అందులో నిజమెంతో కానీ, మొదట ఈ సినిమాను ప్రారంభించినట్లు సనాతన ధర్మం అనే అంశం లేదు. అప్పటికీ ఆ పదం  కూడా ఎవరికీ పెద్దగాతెలీదు. ఇప్పుడు రాజకీయంగా బాధ్యత నెత్తిమీద వుంది గనుక కథలో సనాతన ధర్మం వచ్చిచేరింది. పైగా అంతకుముందు దొంగతనం, దోపిడీ నేపథ్యకథగా రూపొందినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు చారిత్రక నేపథ్యం అంటూ కొత్తగా పదం యాడ్ అయిందని తెలుస్తోంది. పైగా దీనికి రెండు భాగాలు అని చెబుతున్నారు. రెండు భాగాలు అవసరమా? అనేది కూడా వినిపిస్తుంది. ఏది ఏమైనా సినిమా జులైలో విడుదలకావచ్చనేది వినిపిస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.