1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Bengaluru stampede: Activist lodges police complaint against Virat Kohli

క్రికెటర్ విరాట్ కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు.. ఎందుకు?

Kohli
బెంగుళూరు నగరంలోని చిన్నస్వామి స్టేడియం వద్ద రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు (ఆర్.సి.బి) జట్టు సన్మాన కార్యక్రమం సందర్బంగా జరిగిన తొక్కిసలాట ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ దుర్ఘటనలో 11 మంది మృతి చెందిన విషయం తెల్సిందే. 
 
నైజ హోరాటగారర వేదిక తరపున ఏఎం వెంకటేశ్ అనే వ్యక్తి కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌‍లో ఈ ఫిర్యాదు చేశారు. ప్రముఖ క్రికెటర్ అయిన కోహ్లీపై చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, ఇప్పటికే చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఇప్పటికే ఈ ఘటనపై నమోదైన ఎఫ్ఐఆర్‌తో కలిపి దీనిని కూడా విచారణకు పరిగణనలోకి తీసుకుంటామని వెంకటేశ్‌కు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. 
 
ఈ తొక్కిసలాట ఘటనపై కర్నాటక పోలీసులు ఇప్పటికే నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఆర్సీబీ ఫ్రాంచైజీ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్ సంస్థ డీఎన్ఏ, కర్నాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కేఎస్‌సీఏ పాలక కమిటీలు అవసరమైన అనునుతులు లేకుండానే విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించామని పేర్కొన్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఐసీసీ క్రికెట్ 'హాల్ ఆఫ్ ఫేమ్‌'లో భారత కలికితురాయి