1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Bengaluru Stampede: Cops arrest RCB's Marketing Head Nikhil Sosale from airport

బెంగుళూరు తొక్కిసలాట : ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ అరెస్టు!!

arrest
ఇటీవల బెంగుళూరు నగరంలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు చెందిన మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలే‌ను పోలీసులు అరెస్టు చేశారు. ముంబై వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఆయనను బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్టు జాతీయ మీడియా కథనాల సమాచారం. 
 
ఇదే కేసుకు సంబంధించి పోలీసులు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకు చెందిన కొందరు అధికారులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. నిఖిల్ సోసాలేను పోలీసులు ప్రస్తుతం రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం.
 
ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఆర్సీబీ యాజమాన్యంగానీ, నిఖిల్ సోసాలే కుటుంబ సభ్యులు గానీ ఈ అరెస్టుపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఈ వార్త ప్రస్తుతం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 
తర్వాతి కథనం
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన పియూష్ చావ్లా!!