సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 9 జనవరి 2018 (09:30 IST)

హఫీజ్ క్యాలెండర్‌: పాక్ పత్రికలు కూడా కొమ్ముకాస్తున్నాయా?

ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్-ఉద్-దవా (జేయూడీ) చీఫ్ హఫీజ్ సయీద్ ఫోటోలతో కూడిన క్యాలెండర్‌ను పాకిస్థాన్‌కు చెందిన ఓ ఉర్దూ పత్రిక విడుదల చేసింది. తద్వారా టెర్రరిస్టులకు పాకిస్థాన్ సర్కారే కాదు.. ఆ దేశ

ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్-ఉద్-దవా (జేయూడీ) చీఫ్ హఫీజ్ సయీద్ ఫోటోలతో కూడిన క్యాలెండర్‌ను పాకిస్థాన్‌కు చెందిన ఓ ఉర్దూ పత్రిక విడుదల చేసింది. తద్వారా టెర్రరిస్టులకు పాకిస్థాన్ సర్కారే కాదు.. ఆ దేశ పత్రికలు కూడా కొమ్ముకాస్తున్నాయని ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి.

హఫీజ్ క్యాలెండర్‌ను ఓ పత్రిక విడుదల చేసిందంటూ.. పాకిస్థాన్‌కే చెందిన ఓ జర్నలిస్టు ఖురేషి తన ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నారు. అంతేగాకుండా పాకిస్థాన్‌కు చెందిన ఉర్దూ దినపత్రిక ‘ఖబ్రైన్’ జేయూడీ చీఫ్ ఫొటోతో కొత్త క్యాలెండర్‌ను విడుదల చేసింది'' అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. 

ఇకపోతే, హఫీజ్ ఈ ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అన్నీ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే గృహనిర్భంధం నుంచి బయటపడిన హఫీజ్.. ''మిల్లి ముస్లిం లీగ్'' (ఎంఎంఎల్) పేరుతో ఓ పార్టీని స్థాపించాడు.