శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 7 జనవరి 2018 (15:37 IST)

పాక్‌కు వైట్‌హౌస్ హెచ్చరిక.. ఉగ్రవాదుల విషయాన్ని సీరియస్‌గా తీసుకోండి

పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు స్వర్గధామంలా ఉంటోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా పాకిస్థాన్‌కు అమెరికా ఆర్థిక సాయాన్ని కూడా ఆపేసింది. తాజాగా ట

పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు స్వర్గధామంలా ఉంటోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా పాకిస్థాన్‌కు అమెరికా ఆర్థిక సాయాన్ని కూడా ఆపేసింది. తాజాగా ట్రంప్ మరో విధంగా పాకిస్థాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్థాన్‌తో ఎలా వ్యవహరించాలనే విషయంలో అన్ని రకాల మార్గాలున్నాయని శ్వేతసౌధం తెలిపింది. 
 
తాలిబన్లు, హక్కనీ నెట్‌వర్క్ ఉగ్రవాదులపై పాకిస్థాన్ తగిన చర్యలు తీసుకోకపోతే ఏం చెయ్యాలో తమకు తెలుసని హెచ్చరించింది. ఆప్ఘనిస్థాన్  సరిహద్దులో ఉగ్రస్థావరాలపై పాక్ దాడులు జరపాలని అమెరికా కోరుకుంటున్నట్లు శ్వేతసౌధం అధికారి ఒకరు వెల్లడించారు. అదేవిధంగా ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని, అలా జరిగితే ఇరు దేశాల మధ్య తిరిగి సానుకూల పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొన్నారు. 
 
ఉగ్రవాదుల అంశంపై పాక్ త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని మరోసారి నొక్కి చెప్పారు. అమెరికా పరస్పర సహకారానికే మొగ్గు చూపుతుందని తెలిపారు. ఉగ్రవాదుల విషయంలో అమెరికా ఎంత సీరియస్‌గా ఉందో పాక్ గుర్తించాలని శ్వేతసౌధం అధికారి వెల్లడించారు.