మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 9 ఏప్రియల్ 2018 (15:16 IST)

భార్య ఆస్తి కాదు.. ఓ వస్తువు కాదు.. ఇష్టం లేదంటే ఎలా జీవిస్తావ్?: సుప్రీం

వేధిస్తున్న తన భర్తతో కలిసి వుండలేనని ఓ బాధిత మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. తన భర్త తనతో కలిసివుండాలని కోరుకుంటున్నప్పటికీ.. తాను ఆయనతో కలిసి వుండలేనని బాధితురాలు

వేధిస్తున్న తన భర్తతో కలిసి వుండలేనని ఓ బాధిత మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. తన భర్త తనతో కలిసివుండాలని కోరుకుంటున్నప్పటికీ.. తాను ఆయనతో కలిసి వుండలేనని బాధితురాలు పిటిషన్‌లో పేర్కొంది.

దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు.. భార్య ఆస్తి కాదని.. ఆమె ఓ వస్తువూ కాదని.. తనతో కలిసి వుండమని బలవంతం చేస్తే కుదరదన్నట్లు స్పష్టం చేసింది. వేధింపులకు గురిచేస్తున్న భర్తతో కలిసి వుండలేనంటూ చెప్తున్న బాధితురాలు చెప్పడంతో కోర్టు.. ఆమె భర్తను ప్రశ్నించింది. 
 
తన భర్త తనతో కలిసి ఉండాలని కోరుకుంటున్నా తాను మాత్రం అతనితో కలసి అడుగులు వేయలేనని బాధితురాలు కోర్టుకు వెల్లడించింది. దీనిపై జస్టిస్ మదన్ బిలోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ... భార్య ఆస్తి, వస్తువు కాదని.. ఆమెకు ఇష్టం లేనప్పుడు ఆమెతో కలిసి ఎలా జీవిస్తావని భర్తను ప్రశ్నించింది. తదుపరి విచారణను ధర్మాసనం ఆగస్ట్ 8కి వాయిదా వేసింది.