శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 7 ఏప్రియల్ 2018 (11:31 IST)

నటుడు రావు గోపాల్ రావు సతీమణి కన్నుమూత

సీనియర్ నటుడు, దివంగత రావు గోపాల్ రావు సతీమణి కమల కుమారి శనివారం కన్నుమూశారు. ఆమెకు వయసు 73 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆమె... హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న స్వగృహంలో తు

సీనియర్ నటుడు, దివంగత రావు గోపాల్ రావు సతీమణి కమల కుమారి శనివారం కన్నుమూశారు. ఆమెకు వయసు 73 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆమె... హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న స్వగృహంలో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
కాగా, రావు గోపాల్‌ రావు - కమల కుమారి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడు రావు రమేష్ ప్రస్తుతం టాలీవుడ్‌లో ప్రముఖ విలన్‌గా, సహాయ నటుడిగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. 
 
అలాగే, కమల కుమారి కూడా ప్రముఖ హరికథా కళాకారిణి. ఈమె అనేక వేదికలపై హరికథా గానం చేశారు. ఆ సమయంలోనే రావు గోపాల్‌ రావును కమల కుమారి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.