శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 28 మార్చి 2018 (09:21 IST)

కలియుగ ధర్మరాజు... జూదంలో భార్య - కుమారుల తాకట్టు

మహాభారత కథలో ధర్మరాజు తన సతీమణి ద్రౌపదిని ఫణంగా పెట్టి జూదమాడారు. ఈ జూదంలో పాంచాలితో పాటు సరస్వం కోల్పోయి పంచపాండవులు అడవులపాలవుతారు. ఇలాంటి కథలాంటిదే ఇపుడు ఒకటి వెలుగులోకి వచ్చింది.

మహాభారత కథలో ధర్మరాజు తన సతీమణి ద్రౌపదిని ఫణంగా పెట్టి జూదమాడారు. ఈ జూదంలో పాంచాలితో పాటు సరస్వం కోల్పోయి పంచపాండవులు అడవులపాలవుతారు. ఇలాంటి కథలాంటిదే ఇపుడు ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ అభినవ ధర్మరాజు తన భార్యతో పాటు ఇద్దరు కుమారులనుపెట్టి జూదమాడాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులాంద్‌ షహర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బులాంద్‌ షహర్‌కు చెందిన మోహిసీన్ అనే వ్యక్తి జూదమనే వ్యససానికి బానిసయ్యాడు. తన మిత్రుడు ఇమ్రాన్‌తో జూదమాడాడు. ఈ జూదంలో తన భార్య, ఇద్దరు పిల్లల్ని ఫణంగా పెట్టి ఓడిపోయాడు. అయితే, జూదంలో గెలిచిన ఇమ్రాన్‌, నేరుగా మోహిసీన్‌ ఇంటికెళ్లి అతని భార్యను తనతో రమ్మని బలవంతం చేశాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఇమ్రాన్‌ను అడ్డుకోవడంతో విషయాన్ని గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకెళ్లాడు. ఈ వ్యవహారంపై పంచాయతీ నిర్వహించిన గ్రామ పెద్దలు జూదంలో మోహిసీన్ ఓటమిపాలయ్యాడు కనుక, అతని భార్య ఇమ్రాన్‌తో వెళ్లేందుకు నిరాకరించడంతో అతని పిల్లల్లో ఒకరిని ఇమ్రాన్ వెంట పంపాలని తీర్పునిచ్చింది. దీంతో ఆమె పిల్లల్లో ఒకరిని ఇమ్రాన్ తన వెంట తీసుకెళ్లిపోయాడు. 
 
ఈ ఘటనతో మోహిసీన్‌కు అతని భార్య విడాకులిచ్చేసింది. అనంతరం తన భర్త, బలవంతంగా తనను తీసుకెళ్లే ప్రయత్నం చేసిన ఇమ్రాన్, మరో ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆమె కోర్టును ఆశ్రయించి, తన కుమారుడి ఇమ్రాన్ చెర నుంచి విడిపించాలని కోరింది. పిటిషన్ చూసిన చీఫ్‌ జ్యూడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు, వెంటనే కేసు నమోదు చేసి, నిందితులను హాజరుపరచాలని పోలీసులను ఆదేశించడంతో రంగంలోకి దిగిన ఖాకీలు... ఇమ్రాన్ కోసం గాలిస్తున్నారు.