బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : మంగళవారం, 27 మార్చి 2018 (11:32 IST)

శ్రీవారి ఆలయంలో అపశృతి.. ఏం జరిగింది?

శ్రీరామనవమి సందర్భంగా తిరుమలలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కోదండరాముడి అవతారంలో శ్రీవారు హనుమంత వాహనంపై దర్శనమిచ్చారు. శ్రీరామనవమి వేడుకలను తిలకించేందుకు తిరుమలకు భక్తులు

శ్రీరామనవమి సందర్భంగా తిరుమలలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కోదండరాముడి అవతారంలో శ్రీవారు హనుమంత వాహనంపై దర్శనమిచ్చారు. శ్రీరామనవమి వేడుకలను తిలకించేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో స్వామి వారి దర్శనానికి భక్తులు కొన్ని గంటల సేపు క్యూ లైన్లలో వేచివుండాల్సి వచ్చింది. 
 
ఇదిలా ఉంటే.. తిరుమల శ్రీవారి ఆలయంలో అపశృతి చోటుచేసుకుందని ప్రచారం సాగుతోంది. శ్రీవారు, అమ్మవారు ఉత్సవ మూర్తులను తీసుకెళుతున్న సమయంలో అమ్మవారి విగ్రహం అర్చుకుని చేతుల నుంచి జారిపడింది. ఈ ఘటన ఆలయంలో కలకలం రేపింది. 
 
ఈ ఘటన సోమవారం నాడు జరుగగా, విగ్రహం కింద పడిందన్న విషయాన్ని బయటకు రానీయకుండా, రహస్యంగా శాంతి హోమాన్ని అర్చకులు నిర్వహించినట్టు సమాచారం. కానీ ఈ అపశ్రుతి గురించి సదరు దృశ్యాలను చూసిన భక్తులు ఈ వ్యవహారాన్ని బయటపెట్టారు. వయోభారం మీదపడిన అర్చకుడు విగ్రహాన్ని తెస్తున్నవేళ ఈ ఘటన జరిగిందని, విగ్రహం బరువుగా ఉండటంతోనే చేయి జారి కిందపడిందని వార్తలు వస్తున్నాయి.