శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 14 మార్చి 2018 (17:12 IST)

శ్రీవారికి కొత్త కళ: జయవిజయల నుంచే స్వామి విగ్రహం వెలిగిపోతోంది

తిరుమల శ్రీవారికి కొత్త కళ వచ్చేసింది. భక్తుల కోరిక మేరకు శ్రీవారు ఇక స్పష్టంగా కనిపిస్తారు. ఎందుకంటే.. ఇక శ్రీవారు మరింత కొత్తవెలుగుతో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ మేరకు భక్తుల సూచనల ప్రకారం గర్భగుడ

తిరుమల శ్రీవారికి కొత్త కళ వచ్చేసింది. భక్తుల కోరిక మేరకు శ్రీవారు ఇక స్పష్టంగా కనిపిస్తారు. ఎందుకంటే.. ఇక శ్రీవారు మరింత కొత్తవెలుగుతో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ మేరకు భక్తుల సూచనల ప్రకారం గర్భగుడిలో నేతి దీపాల కాంతిని టీటీడీ పెంచింది. దీనికోసం ప్రత్యేకంగా ఇద్దరు ఏకాంగులను నియమించి దీపకాంతి తగ్గకుండా పర్యవేక్షణ చేయిస్తోంది. 
 
తిరుమల వెంకన్నను గర్భగుడిలో శ్రీవారిని భక్తులు కేవలం కొన్ని క్షణాలు మాత్రమే దర్శించగలుగుతున్నారు. అలాంటి మనోహరమైన రూపం మరింత వెలుగులో చూసి తరించేలా చేశారు. ఆగమ నియమానుసారం శ్రీవారి గర్భగుడిలో విద్యుత్ దీపాలను వెలిగించకూడదనే నియమం వుంది. నేతి దీపాల వెలుగులోనే స్వామిని దర్శించుకోవాల్సి వుంటుంది. 
 
దీపకాంతి తగ్గకుండా మూలమూర్తికి పైభాగంలో వేలాడదీసిన రెండు దీపకుండీలతో పాటు కిందిభాగంలోని మరో రెండు దీపకుండీలలో వేకువజామున సుప్రభాత సేవలో, మధ్యాహ్యం 11గంటలకు, సాయంత్రం 6.30 గంటలకు తోమాల సమయంలో నెయ్యిని నింపి కాంతి తగ్గకుండా చర్యలు తీసుకున్నారు. జయవిజయల నుంచే స్వామి విగ్రహం స్పష్టంగా కనిపిస్తుండటంతో భక్తులు సంతోషిస్తున్నారు.