గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : శనివారం, 3 మార్చి 2018 (13:18 IST)

పదండయ్యా... ఎప్పుడు చూసినా ప్రత్యేక హోదానేనా... చౌదరి చిందులు

తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రత్యేక హోదా అన్న పదం వినిపిస్తే చాలు... అంతెత్తున లేచిపడుతున్నారు. ఇప్పటికే కేంద్రంతో పోరాటం చేసి... చేసి.. విసిగిపోయిన టిడిపి నేతలు ప్రత్యేక హోదా అంటేనే ఆమడదూరం పరుగెత్తు

తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రత్యేక హోదా అన్న పదం వినిపిస్తే చాలు... అంతెత్తున లేచిపడుతున్నారు. ఇప్పటికే కేంద్రంతో పోరాటం చేసి... చేసి.. విసిగిపోయిన టిడిపి నేతలు ప్రత్యేక హోదా అంటేనే ఆమడదూరం పరుగెత్తుతున్నారు. ఇక పర్యటనల్లో టిడిపి మంత్రులు వెళ్ళే సమయంలో మీడియా ప్రశ్నిస్తే అస్సలు ఊరుకోవడం లేదు. మీడియాపై చిందులు తొక్కేస్తున్నారు. అలాంటి పనే కేంద్రమంత్రి సుజనాచౌదరి కూడా చేశారు.
 
తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా సుజనాచౌదరి దర్శించుకున్నారు. తన కుమార్తె వివాహం తర్వాత మొదటిసారి ఆయన స్వామిసేవలో పాల్గొన్నారు. ఆలయంలో టిటిడి అధికారులు సుజనాచౌదరికి ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శనా ఏర్పాట్లు చేశారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. 
 
ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించానన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం మీ నేతృత్యంలో కేంద్రంపై పోరాటం జరుగుతోందట అనగానే చౌదరిగారికి చిర్రెత్తుకొచ్చింది. పదండయ్యా.. ఎప్పుడు చూసినా ప్రత్యేక హోదానేనా.. దేవుడు దగ్గర అదంతా వద్దు.. జరగండి.. జర అంటూ బిరబిరా వెళ్లిపోయారు కేంద్ర మంత్రి చౌదరిగారు.