శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By TJ
Last Updated : మంగళవారం, 6 మార్చి 2018 (17:13 IST)

తిరుమలలో ఒకే రోజు 2 వేల పెళ్ళిళ్ళు.. ఆల్‌టైం రికార్డ్ (Video)

తిరుమలలో ఒక్కరోజే 2వేల వివాహాలు జరిగాయి. తిరుమలలోని అన్ని కళ్యాణ మండపాలు పూర్తిగా నిండిపోయాయి. టిటిడికి చెందిన పురోహిత మండపంలో చాలా తక్కువ బడ్జెట్‌తో వివాహం చేసుకుంటుంటారు. అలాంటి పురోహిత మండపం పూర్తి

తిరుమలలో ఒక్కరోజే 2వేల వివాహాలు జరిగాయి. తిరుమలలోని అన్ని కళ్యాణ మండపాలు పూర్తిగా నిండిపోయాయి. టిటిడికి చెందిన పురోహిత మండపంలో చాలా తక్కువ బడ్జెట్‌తో వివాహం చేసుకుంటుంటారు. అలాంటి పురోహిత మండపం పూర్తిగా నిండిపోయి బయట కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. కొంతమంది ఆలయం ముందు కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఒక్కసారిగా ఈ స్థాయిలో తిరుమలలో పెళ్ళిళ్ళు జరగడం ఆల్‌టైం రికార్డ్ అంటున్నారు టిటిడి అధికారులు.
 
ఫిబ్రవరి 18వ తేదీ నుంచి రెండు రోజుల ముందు వరకు మూఢం ఉండటంతో వివాహాలు పెద్దగా జరగలేదు. అంతేకాకుండా గత రెండు రోజులుగా మంచి ముహూర్తం ఉండటంతో ఇక ఒక్కసారిగా 2 వేల జంటలు తిరుమలలో ఒకింటి వారయ్యారు. తిరుమల శ్రీవారి చెంత వివాహం చేసుకుంటే వందేళ్ళ పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జీవితాన్ని గడపవచ్చన్నది భక్తుల నమ్మకం. 
 
అందుకే వివిధ రాష్ట్రాల నుంచి అధికసంఖ్యలో తిరుమలకు చేరుకుని వివాహాలు చేసేసుకున్నారు. గతంలో ఈ స్థాయిలో వివాహాలు జరుగలేదని.. బహుశా ఇది టిటిడి చరిత్రలోనే ఆల్‌టైం రికార్డ్ అంటున్నారు టిటిడి అధికారులు. అంతేకాకుండా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా పెళ్ళిళ్ళ సందడి కనిపించింది. కళ్యాణ మండపాలన్నీ గత రెండురోజులుగా నిండిపోయాయి.