శనివారం, 25 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 27 మార్చి 2018 (14:29 IST)

బాల్ టాంపరింగ్ ప్రకంపనలు : ఆసీస్ ప్రధాన కోచ్ రిజైన్?

బాల్ టాంపరింగ్ వ్యవహారం ఆస్ట్రేలియా క్రికెట్‌ను ఓ కుదుపుకుదుపుతోంది. ఈ వ్యవహారంలో చిక్కుకుని ఇప్పటికే కెప్టెన్, వైస్ కెప్టెన్ స్థానాల నుంచి స్మిత్, వార్నర్ తప్పుకున్నారు. అలాగే, ఐసీసీ స్మిత్‌పై ఒక మ్య

బాల్ టాంపరింగ్ వ్యవహారం ఆస్ట్రేలియా క్రికెట్‌ను ఓ కుదుపుకుదుపుతోంది. ఈ వ్యవహారంలో చిక్కుకుని ఇప్పటికే కెప్టెన్, వైస్ కెప్టెన్ స్థానాల నుంచి స్మిత్, వార్నర్ తప్పుకున్నారు. అలాగే, ఐసీసీ స్మిత్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధించింది. అటు క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ మొదలుపెట్టింది. 
 
ఈ నేపథ్యంలో కోచ్ డారెన్ లీమన్ సౌతాఫ్రికాతో నాలుగో టెస్ట్ మొదలయ్యేలోపే తన పదవికి రాజీనామా చేయనున్నాడనే వార్తను బ్రిటన్ పత్రిక డైలీ టెలిగ్రాఫ్ వెల్లడించింది. నిజానికి ఈ టాంపరింగ్ టీమ్‌లోని సీనియర్ ప్లేయర్స్ అందరం కలిసి తీసుకున్న నిర్ణయమని, ఇందులో కోచింగ్ స్టాఫ్‌కు ఎలాంటి సంబంధం లేదని స్మిత్ చెప్పారు. అయితే బాన్‌క్రాఫ్ట్ బాల్ టాంపరింగ్‌ను టీవీల్లో చూపించగానే.. ఆ విషయాన్ని ఫీల్డ్‌లో ఉన్న ఆ ప్లేయర్‌కు చేరవేసి ఈ మోసంలో లీమన్ కూడా పాలుపంచుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయన కూడా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
మరోవైపు ఈ బాల్ టాంపరింగ్ ఉదంతాన్ని సీరియస్‌గా పరిగణించిన ఆ దేశ ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. ఇప్పటికే ఆయన క్రికెట్ ఆస్ట్రేలియా ఛైర్మన్ డేవిడ్ పీవర్‌తో మాట్లాడారు. మోసం చేయడం దారుణం అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ప్రత్యర్థులను స్లెడ్జింగ్ చేయడాన్ని కూడా టర్న్‌బుల్ తీవ్రంగా తప్పుబట్టారు. స్లెడ్జింగ్‌కు పాల్పడినవారి పట్ల కూడా కఠినంగా వ్యవహరించాలని ఆయన తేల్చి చెప్పారు. స్లెడ్జింగ్‌కు క్రికెట్‌లో స్థానం లేదని టర్న్‌బుల్ వ్యాఖ్యానించడం గమనార్హం.