శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : బుధవారం, 21 మార్చి 2018 (15:41 IST)

నేను రాజీనామా చేయాలంటే.. సీఎం కూడా చేయాల్సిందే : ఎమ్మెల్సీ సోము వీర్రాజు

ఎన్డీయే కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ వైదొలగింది. అలాగే, కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నుంచి టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు తమతమ మంత్రిపదవులకు రాజీనామా చేశారు. అలాగే, ఏపీలో కూడా బీజేపీకి చ

ఎన్డీయే కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ వైదొలగింది. అలాగే, కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నుంచి టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు తమతమ మంత్రిపదవులకు రాజీనామా చేశారు. అలాగే, ఏపీలో కూడా బీజేపీకి చెందిన ఇద్దరు రాష్ట్ర మంత్రులు కూడా తమతమ పదవుల నుంచి తప్పుకున్నారు. 
 
అయితే, టీడీపీ ఎమ్మెల్యేల మద్దతుతో ఎంపికైన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాత్రం యధావిధిగానే కొనసాగుతున్నారు. అయితే, ఇటీవల సోము వీర్రాజు తన పదవికి రాజీనామా చేయనున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై వీర్రాజు స్పందిస్తూ... అదంతా తప్పుడు ప్రచారమేనని కొట్టిపారేశారు.
 
గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలు కలసి పోటీ చేసి అధికారంలోకి వచ్చాయని చెప్పారు. ఎమ్మెల్యేల కోటాలో తాను ఎమ్మెల్సీగా ఎన్నికయ్యానని... ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తే... తాను కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తామని తెలిపారు.
 
చంద్రబాబు, టీడీపీపై యుద్ధం చేయాలంటూ ఢిల్లీలోని బీజేపీ పెద్దలు తమను ప్రోత్సహిస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. యుద్ధం చేయాలని తమకు ఎవరూ చెప్పలేదని వివరణ ఇచ్చారు.