1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. bjp mla vishnu kumar raju fire on tdp

చంద్రబాబును ముఖ్యమంత్రి చేసింది మేమే: బీజేపీ ఎమ్మెల్యే

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆధిపత్యపోరు తారా స్థాయికి చేరింది. ఒకవైపు అవిశ్వాస తీర్మానం అస్త్రంతో బీజేపీకి టీడీపీ ముచ్చెమటలు పోయిస్తోంది. దీని నుంచి తప్పించుకునేందుకు అన్నాడీఎంకే అస్త్రాన్ని బీజేపీ

bjp mla
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆధిపత్యపోరు తారా స్థాయికి చేరింది. ఒకవైపు అవిశ్వాస తీర్మానం అస్త్రంతో బీజేపీకి టీడీపీ ముచ్చెమటలు పోయిస్తోంది. దీని నుంచి తప్పించుకునేందుకు అన్నాడీఎంకే అస్త్రాన్ని బీజేపీ ప్రయోగించింది. మరోవైపు, టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటలయుద్ధం కూడా రోజురోజుకీ పెరుగుతోంది. బీజేపీపై టీడీపీ నేతలు, టీడీపీపై బీజేపీ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఏపీ శాసనసభలో సభ్యుడిగా ఉన్న విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీ, పవన్‌కల్యాణ్‌ అండతోనే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందని, లేకపోతే జగన్‌ సీఎం అయి, చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చునేవాడని వ్యాఖ్యానించారు. టీడీపీ మిత్రపక్షం కాబట్టే ఇంతకాలం సంయమనంతో వ్యవహరించామన్నారు. 
 
విశాఖలో జరిగిన భూకుంభకోణాలు తన వల్లే బయటకు వచ్చాయని, సిట్‌ ఏర్పాటుకు ప్రధాన కారణం తానేనన్నారు. ఏపీలో ప్రస్తుతం బీజేపీయే ప్రతిపక్ష పాత్రను పోషిస్తోందని చెప్పారు. టీడీపీ నాయకుల అవినీతి పెరిగిపోయిందని, ఇసుక మాఫియాలు దోచుకుంటున్నాయని ఆరోపించారు. విశాఖ కేంద్రంగా ఈ ఏడాదే రైల్వేజోన్‌ ఏర్పాటు అవుతుందని స్పష్టంచేశారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
రామ్ విలాస్ పాశ్వాన్ జోస్యం చెప్పారు.. ఇక మోడీ తట్టాబుట్టా సర్దకోవాల్సిందే...