మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 18 మార్చి 2018 (16:23 IST)

రేపో మాపో జగన్ కేసులు కూడా మాఫీ.. సమాచారం వచ్చింది: బాబు

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా కావాలంటూ వైకాపా కేంద్రం అవిశ్వాసం ప్రవేశపెట్టనుంది. ఇందుకు టీడీపీ కూడా సై అంటోంది. దీంతో మోదీ సర్కారును గద్దె దించేందుకు విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చ

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా కావాలంటూ వైకాపా కేంద్రం అవిశ్వాసం ప్రవేశపెట్టనుంది. ఇందుకు టీడీపీ కూడా సై అంటోంది. దీంతో మోదీ సర్కారును గద్దె దించేందుకు విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు వైకాపాపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం అంటున్న జగన్మోహన్ రెడ్డి తన కేసులను మాఫీ చేసుకునేందుకు పీఎంవో చుట్టూ తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ- వైసీపీ కుమ్మక్కైయ్యాయని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పావుగా మారిపోయారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.
 
ఇంకా తాము రాష్ట్ర ప్రయోజనాలకోసం కేంద్రంపై పోరాటం చేస్తుంటే వైసీపీ నేతలు పీఎంవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.  పీఎంవోలో జగన్ అనుచరులు వున్నారని.. రేపో మాపో జగన్ కేసులు కూడా మాఫీ కావొచ్చుననే సమాచారం అందిందని చంద్రబాబు చెప్పారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నామని.. ఎన్డీఏ నుంచి బయటికి రావడం ద్వారా జనసేన, వైసీపీ, బీజేపీల మహా కుట్రను బయటపెట్టామని చంద్రబాబు వెల్లడించారు.