ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 5 మార్చి 2018 (18:09 IST)

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల మూవీ ఇంట్ర‌ెస్టింగ్ డీటైల్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందాల‌ని ఎంతోకాలంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎట్ట‌కేల‌కు ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ల‌బోతుంది. ఈ చిత్రం హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ ప్రతి

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందాల‌ని ఎంతోకాలంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎట్ట‌కేల‌కు ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ల‌బోతుంది. ఈ చిత్రం హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
 
#NTR28 చిత్రానికి అందాల భామ పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఎంపిక చేసారు. సంగీతాన్నీ థమన్ అందించగా, ఈ చిత్రానికి ఛాయాగ్రహణం పి. ఎస్. వినోద్ అందిస్తార‌ని అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసారు. ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ కాంబినేషన్లో రూపొందే ఈ తొలి చిత్రాన్ని తమ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించటం ఎంతో ఆనందంగా ఉందని నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) తెలిపారు. ఈ నెలాఖ‌రున‌ ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని అన్నారు. ఈ సంవత్సరం ద్వితీయ భాగంలో చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్ర వర్గం తెలిపింది.
 
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, ఆ..ఆ, అజ్ఞాతవాసి చిత్రాల‌ను నిర్మించింది.