శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 3 మార్చి 2018 (13:16 IST)

బాహుబలి తరహాలో వర్క్ షాప్.. ఎన్టీఆర్, చెర్రీలకు రిహార్సల్స్

బాహుబలి సినిమా తర్వాత రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లతో మల్టీస్టారర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇప్పటికే ఈ స్క్రిప్ట్‌ను ఎన్టీఆర్, చెర్రీ విన్నట్లు సమాచారం. ఈ సినిమాకు

బాహుబలి సినిమా తర్వాత రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లతో మల్టీస్టారర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇప్పటికే ఈ స్క్రిప్ట్‌ను ఎన్టీఆర్, చెర్రీ విన్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి జూలైలో వర్క్ షాప్ నిర్వహించనున్నారని.. దాదాపు 20 రోజుల పాటు సాగే ఈ వర్క్ షాపులో ఎన్టీఆర్, చెర్రీలకు రిహార్సల్స్ నిర్వహిస్తున్నట్లు చెప్తున్నారు. 
 
గతంలో బాహుబలి సినిమాకు గాను రానా, ప్రభాస్‌లతో రాజమౌళి వర్క్ షాప్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చెర్రీ, ఎన్టీఆర్ రిహార్సల్స్ ఈ వర్క్ షాపుల్లో పూర్తయ్యాక ఆగస్టు నుంచి సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం. 
 
అలాగే ఈ సినిమా కోసం హీరోయిన్లు, ఇతర కీలక పాత్రల కోసం వేట జరుగుతోంది. ఈ చిత్రంలో చెర్రీ, ఎన్టీఆర్ సోదరులుగా నటించనున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందుకోసం రాజమౌళి.. బాక్సింగ్ సెషన్స్, మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు.