1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. CM KCR Announced Rajya Sabha Candidates Name in TRS Bhavan

కేసీఆర్ తోడల్లుడు రవీందర్ రావు కుమారుడుకి రాజ్యసభ సీటు

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తరపున రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం వెల్లడించారు.

Rajya Sabha
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తరపున రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు. 
 
ఈ సమావేశంలో ఆయన అన్ని విషయాలపై చర్చించి అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. ఈ సమావేశం అనంతరం తెరాస రాజ్యసభ అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. జోగినపల్లి సంతోష్ కుమార్, లింగయ్య యాదవ్ (నల్లగొండ), బండ ప్రకాశ్ ముదిరాజ్ (వరంగల్) పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు. ఈ ముగ్గురు అభ్యర్థులు రేపు నామినేషన్లు వేయనున్నారు. రాజ్యసభకు ఎంపిక చేసిన అభ్యర్థులను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పరిచయం చేశారు. 
 
కాగా, ఈ ముగ్గురు అభ్యర్థుల్లో జోగినపల్లి సంతోష్ కుమార్ సీఎం కేసీఆర్ తోడల్లుడు రవీందర్ రావు కుమారుడు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి కేసీఆర్‌కు సంతోష్ కుమార్ సన్నిహితంగా ఉంటున్నారు. ప్రస్తుతం తెరాస ప్రధాన కార్యదర్శిగా, టీ న్యూస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‍గా పని చేస్తున్నారు. అలాగే, పార్టీ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఓ నర్తకి నా మనసు పాడు చేసింది : ఆజాం ఖాన్ (వీడియో)