టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు.. నిర్ణయం బాధ కలిగించింది : వర్ల రామయ్య
తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్‌తో పాటు టీడీపీ ల
తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్‌తో పాటు టీడీపీ లీగల్ సెల్ విభాగం అధ్యక్షుడిగా ఉన్న కనకమేడల రవీంద్ర కుమార్ పేర్లను ఆయన ఖరారు చేశారు.
నిజానికి ఆ పార్టీ సాంస్కృతిక విభాగం ఎస్సీ నేత వర్ల రామయ్య పేరును పరిశీలించారు. అయితే, సామాజిక సమీకరణాల నేపథ్యంలో చివరి నిమిషంలో వర్ల రామయ్య పేరును తొలగించి ఆయన స్థానంలో రవీంద్ర కుమార్ పేరును చేర్చి, రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు.
దీనిపై వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ, పార్టీ తీసుకున్న నిర్ణయం తనకు బాధ కలిగించినప్పటికీ, అధినేత చంద్రబాబు ఆదేశం శిరోధార్యంగా భావిస్తానని చెప్పారు. కొందరు నేతలు వ్యవహరించినట్లు తాను పదవుల కోసం పార్టీ మారే రకం కాదని, చంద్రబాబుకు అండగా ఉండాలనే తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు.