మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 10 మార్చి 2018 (12:05 IST)

వైకాపా ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫర్.. టీడీపీలోకి వస్తే.. ఆ రెండు పదవులు?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు తెలుగు దేశం పార్టీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మరో వారంలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఏపీలో జరిగే మూడు స్థానాల్లో విజయం సాధించాలంటే.. టీడీపికి మరో ఇ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు తెలుగు దేశం పార్టీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మరో వారంలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఏపీలో జరిగే మూడు స్థానాల్లో విజయం సాధించాలంటే.. టీడీపికి మరో ఇద్దరు ఎమ్మెల్యేల అవసరం ఏర్పడింది. ఇందుకోసం వైకాపా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేల కోసం టీడీపీ నేతలు బేరసారాలు మెుదలుపెట్టినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
అంతేగాకుండా వైసీపీ నుంచి ఎవరైతే జంప్ అయి.. టీడీపీలోకి వస్తారో వారికి ఇప్పటికే రాజీనామాలు చేసిన బీజేపీ నేతలు పైడికొండలు, కామినేని స్థానాలను ఇస్తామని టీడీపీ ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. ఫలితంగా వైకాపా నుంచి పార్టీ ఫిరాయించే వారికి వైద్య, దేవాదాయ శాఖ బాధ్యతలు సిద్ధంగా వున్నాయని కూడా టీడీపీ సంకేతాలు ఇచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికలకు పోటీ చేయాల్సిన టీడీపీ అభ్యర్థులు ఎవరనేదానిపై కసరత్తు మొదలైంది.
 
మరోవైపు బీజేపీతో పొత్తుకు కటీఫ్ ఇచ్చే విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి పదవులనే వదులుకున్న తరువాత, ఇంకా ఎన్డీయేలోనే ఉంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని కొందరు సీనియర్ నేతలు చంద్రబాబుతో చెప్పినా.. బీజేపీకి కొంత సమయం ఇచ్చి చూద్దామని చంద్రబాబు అన్నట్లు వార్తలొస్తున్నాయి.