శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 10 మార్చి 2018 (09:37 IST)

బీజేపీకే మా మద్దతు.. మోదీ హోదా ఇస్తారు: వైకాపా ఎంపీ విజయసాయి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల వైఖరి ఏంటో తేలిపోయింది. టీడీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసిన నేపథ్యంలో బీజేపీపై తన వైఖరేంటో వైకాపా చెప్పేసింది. బీజేపీకే తమ మద్దతు అంటూ ప్రకటించింది. తాము

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల వైఖరి ఏంటో తేలిపోయింది. టీడీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసిన నేపథ్యంలో బీజేపీపై తన వైఖరేంటో వైకాపా చెప్పేసింది. బీజేపీకే తమ మద్దతు అంటూ ప్రకటించింది. తాము ఆ పార్టీతోనే కలిసి నడుస్తామంటూ వైకాపా తెలిపింది. అయితే కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి మాత్రం వైకాపా సిద్ధమవుతోంది. ఏపీకి న్యాయం చేసే విషయంలో ప్రధాని మోదీపై తమకు అపార విశ్వాసం ఉందని చెప్తున్న వైకాపా.. బీజేపీ ప్రభుత్వంపై మాత్రం అవిశ్వాసం పెట్టి తీరుతామని అంటోంది. 
 
తాము అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తుందని హామీ ఇచ్చిన తరుణంలో ఆ పార్టీలో కలుస్తారా అనే ప్రశ్నకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని, కాబట్టి ఆ పార్టీని నమ్మలేమన్నారు. బీజేపీ మాత్రమే హోదా ఇవ్వగలదని, మోదీ తమ డిమాండ్‌ను అంగీకరిస్తారన్న నమ్మకం ఉందని ఎంపీ వివరించారు. హోదా ఇస్తామన్న వారితో కలిసి నడుస్తామని విజయసాయి స్పష్టం చేశారు. అయితే వైకాపా తీరు పట్ల ఇప్పటికే ప్రజలు మండిపడుతున్నారు. అలాగే వైకాపా రాజకీయాలు చేస్తే.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.