శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (14:29 IST)

మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మానమా.. మనకేంటి లాభం : చంద్రబాబు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమని, ఈ తీర్మానానికి టీడీపీ ఎంపీలు మద్దతునిస్తారా అంటూ వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి తన ప్రజా సంకల

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమని, ఈ తీర్మానానికి టీడీపీ ఎంపీలు మద్దతునిస్తారా అంటూ వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి తన ప్రజా సంకల్ప యాత్రలో ప్రశ్నించారు. ఈ వార్తలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. 
 
ఈ నేపథ్యంలో జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడదామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటోందని, దాని వల్ల రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు. శాసనసభ, పార్లమెంటు చట్టాలు తెలియకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని చంద్రబాబు అన్నారు. బీజేపీ నుంచి తమ పార్టీ దూరం అయితే పొత్తు పెట్టుకోవడానికి వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు.
 
విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని, హామీలను పరిష్కరించకపోవడంపై కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు  పోలవరం పూర్తి కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఆటంకాలు కలిగిస్తున్నాయని ఆరోపించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వచ్చే 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చంద్రబాబు పునరుద్ఘాటించారు.