1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. TDP Rajya Sabha Candidates selected

టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే...

రాజ్యసభ ఎన్నికల కోసం అభ్యర్థులను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీలో నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ను రాజ్యసభలో కొనసా

TDP
రాజ్యసభ ఎన్నికల కోసం అభ్యర్థులను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీలో నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ను రాజ్యసభలో కొనసాగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. సీనియర్ నేత వర్ల రామయ్యకు అవకాశం ఇచ్చారు. 
 
టికెట్ కోసం పలువురు నేతలు ప్రయత్నించినప్పటికీ... చివరకు వీరిద్దరికీ అదృష్టం దక్కింది. టీడీపీ ఏపీ అధ్యక్షడు కళా వెంకట్రావు, ఆర్థికమంత్రి యనమలతో భేటీ అయిన అనంతరం... చంద్రబాబు తుది నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించి అభ్యర్థులకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. చివరి నిమిషంలో సమీకరణాలు మారితే తప్ప... వీరిద్దరి పేర్లు దాదాపు ఖరారైనట్టేనని చెబుతున్నారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
డీజే శబ్దానికి గుండెపోటు.. పెళ్లయిన గంటలోనే వధువు కన్నుమూత.. ఎక్కడ?