Vikranth: హారర్ కామెడీ చిత్రంలో హీరో విక్రాంత్
Hero Vikranth
విక్రాంత్ ప్రస్తుతం ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సంస్థ దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్ లో మార్కండేయ అనే డివోషనల్ మిస్టికల్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు. దిల్ రాజు డ్రీమ్స్ సంస్థ తొలి సినిమా హీరో విక్రాంత్ కావడం విశేషం. ఈ సినిమా త్వరలో చిత్రీకరణ జరుపుకోనుంది. మార్కండేయ సినిమా హీరో విక్రాంత్ కు మంచి ఫేమ్ తీసుకురానుంది.
ఈ సినిమాతో పాటు హీరో విక్రాంత్ మధుర శ్రీధర్ రెడ్డి - ప్రొడ్యూసర్ సురేశ్ బాబు కాంబినేషన్ లో ఓ ఇంట్రెస్టింగ్ హారర్ కామెడీ చిత్రంలో నటించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు మేకర్స్ వెల్లడించనున్నారు. మార్కండేయ, మధుర శ్రీధర్ రెడ్డి - సురేశ్ బాబు కాంబో మూవీస్ తో ఒక ప్రామిసింగ్ యంగ్ హీరోగా విక్రాంత్ ఎదుగుతాడనే అంచనాలు ఏర్పడుతున్నాయి. విక్రాంత్ హీరోగా మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
