శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi

టీడీపీ అవిశ్వాస తీర్మానానికి 150 మంది మద్దతు.. ఆ అక్కసే: మంత్రి గంటా

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏపీ సీఎం చంద్రబాబు తీసుకున్న అవిశ్వాసంపై మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ స్వాగతించారు. టీడీపీ తీసుకున్న నిర్ణ‌యం చారిత్రాత్మ‌క‌మైందని, చంద్ర‌బాబు నిర్

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏపీ సీఎం చంద్రబాబు తీసుకున్న అవిశ్వాసంపై మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ స్వాగతించారు. టీడీపీ తీసుకున్న నిర్ణ‌యం చారిత్రాత్మ‌క‌మైందని, చంద్ర‌బాబు నిర్ణ‌యం దేశంలో రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోందని తెలిపారు. దేశ రాజ‌కీయాల్లో చంద్ర‌బాబు నాయ‌క‌త్వం అవ‌స‌ర‌మ‌ని చెప్పారు. 
 
గత ఎన్నిక‌ల స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌యోజ‌నాల దృష్ట్యా బీజేపీతో క‌లిశామని, కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందక పోవడంతో తెలుగువారి ఆత్మ‌గౌర‌వం కోసం చంద్రబాబు పోరాటం చేయక తప్పలేదని.. టీడీపీ అవిశ్వాస తీర్మానానికి 150 మందికి పైగా సభ్యులు మద్దతిచ్చారని వెల్లడించారు. ఇక జనసేనాని గురించి గంటా మాట్లాడుతూ.. సినిమాల‌కు, రాజ‌కీయాల‌కు ఉన్న తేడాను ప‌వ‌న్ క‌ల్యాణ్ గుర్తించాలని అన్నారు. జనసేన సభలో పవన్ మోదీ గురించి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
 
మరోవైపు ప్రధాని మోదీపై ఏపీ మంత్రి అమరనాథరెడ్డి విమర్శలు గుప్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తోందని తెలిపారు. అభివృద్ధిలో గుజరాత్‌ను ఏపీ మించిపోతుందనే అక్కసుతో బాబుపై ఇలా కక్ష సాధించుకుంటున్నారని అమరనాథరెడ్డి ఆరోపించారు. తమిళనాడులో తమ పార్టీకి పట్టులేకున్నా బీజేపీ కల్పించుకుని రాజకీయాలు చేస్తోందని.. ఏపీలోనూ అదే తరహా చిచ్చు రేపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు.