శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 18 మార్చి 2018 (09:25 IST)

2019 ఎన్నికల్లో ఎవరితో పొత్తుండదు.. జగన్ అంటే అభిమానమే: పవన్

2019 ఎన్నికల పొత్తుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడే క్లారిటీ ఇచ్చేశారు. 2019లో జరిగే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులుండబోవని.. ఒంటరి పోరాటం వుంటుందని జనసేనాని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాపై నాలుగేళ్ల

2019 ఎన్నికల పొత్తుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడే క్లారిటీ ఇచ్చేశారు. 2019లో జరిగే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులుండబోవని.. ఒంటరి పోరాటం వుంటుందని జనసేనాని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాపై నాలుగేళ్ల క్రితమే ప్రధాని మోదీతో మాట్లాడానని.. తెలుగుదేశం పార్టీ గురించి తాను చేసిన అన్ని విమర్శల గురించి గతంలోనే బాబుతోనూ చర్చించానని తెలిపారు. 
 
తెలుగుదేశం పాలనలో అవినీతి పెరిగిపోయిందని.. భవిష్యత్తులో కళింగాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ప్రాంతీయవాదం పెరుగుతుందన్న ఆందోళన తనలో వుందని చెప్పారు. తనకు జగన్ అంటే అభిమానం ఉందని.. రాజకీయాల్లో వ్యక్తిగత  అభిప్రాయాలకు తావుండదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తానని తెలిపారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఏపీలో మనుగడ కష్టమని ప్రధానికి తెలుసునని చెప్పారు. 
 
వామపక్షాలతో తనకు తొలినుంచే అవగాహన వుందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఇతర పార్టీలతో పొత్తులకు అవకాశాల్లేవని తెలిపారు. గతంలో తాను ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరాలు పెరుగుతున్నాయని చెప్పినప్పుడు చాలామంది వ్యతిరేకించారని.. దక్షిణాది సీఎంలంతా తన మాటలకు అంగీకరిస్తున్నారని.. దక్షిణాదిపై ఉత్తరాది పెత్తనం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోందని తెలిపారు.