జగన్ ఉచ్చులో చిక్కిన చంద్రబాబు : బీజేపీ ఎంపీ హరిబాబు
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి పన్నిన ఉచ్చులో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిక్కారని బీజేపీ ఎంపీ కె.హరిబాబు ఆరోపించారు. ప్రధాని మోడీ సర్కారుకు వ్యతిరేకంగా టీడీపీ అవిశ్వాస తీర్
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి పన్నిన ఉచ్చులో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిక్కారని బీజేపీ ఎంపీ కె.హరిబాబు ఆరోపించారు. ప్రధాని మోడీ సర్కారుకు వ్యతిరేకంగా టీడీపీ అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వడంపై హరిబాబు స్పందిస్తూ, ప్రత్యేకహోదా పేరుతో భాజపా, తెలుగుదేశం పార్టీల మధ్య చిచ్చుపెట్టి రెండింటినీ విడగొట్టాలని జగన్ పన్నిన ఉచ్చులో చంద్రబాబు చిక్కారన్నారు.
తాజాగా రాజకీయ పరిణామాలపై ఆయన స్పందిస్తూ, 'పవన్‌కల్యాణ్, జగన్‌ను భాజపానే నడిస్తోందన్న ఆరోపణలు వాస్తవంకాదు. కాకినాడ సభలో పవన్ భాజపాను తీవ్రంగా విమర్శించినప్పుడు ఎవ్వరూ దాని గురించి మాట్లాడలేదు. ఈరోజు అదే వ్యక్తితో భాజపాకు ముడిపెట్టడం ఆశ్చర్యకరం. 2014 ఎన్నికల్లో భాజపా, తెదేపా కలవడంవల్లే వైకాపా ఓడిపోయింది కాబట్టి హోదా అంశాన్ని తెరమీదికి తెచ్చి రెండు పార్టీలు విడిపోయేలా జగన్ చేశారు. ఎన్డీయే నుంచి తెలుగుదేశం వైదొలగడం, కేంద్రం ఏమీ చేయలేదనడం అన్యాయం. పవన్, జగన్‌లు మోడీని విమర్శించడంలేదని తెదేపా చెప్పడం ఆశ్చర్యకరం. వారిద్దరూ మోడీని తిడుతుంటే ఆనందించాలనుకుంటున్నారా? అని హరిబాబు ప్రశ్నించారు.