సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 17 మార్చి 2018 (08:46 IST)

కాంగ్రెస్ ప్లీనరీలో ప్రత్యేక హోదా తీర్మానం.. సోనియా నిర్ణయం

తాము చేసిన విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు వీలుగా కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పార్లమ

తాము చేసిన విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు వీలుగా కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇందుకోసం ఆ పార్టీ తమవంతు కృషిచేస్తోంది. 
 
ఈ నేపథ్యంలో శనివారం నుంచి ఢిల్లీ వేదికగా జరిగే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా కేటాయించాలన్న తీర్మానం చేయనుంది. దీనిపై కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు, ప్లీనరీ ఆమోదించనున్నట్లు తెలిసింది. 
 
పార్టీ నూతన అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అధ్యక్షతన శనివారం ఇందిరాగాంధీ స్టేడియంలో ప్లీనరీ ప్రారంభం కానుంది. ఉదయం రాహుల్‌గాంధీ చేసే ప్రసంగం, తీర్మానాలు కాంగ్రెస్‌ భావి రాజకీయాలకు దిశానిర్దేశం చేయనున్నాయి. మిత్రపక్షాలను కూడగట్టుకునేందుకు కాంగ్రెస్‌ ఏం చేస్తుందనే విషయం ఈ తీర్మానాల్లో స్పష్టం కానుంది. రాహుల్‌ అధ్యక్షుడుగా ఎన్నిక కావడాన్ని ప్లీనరీలో పార్టీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించనున్నారు.