శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 16 మార్చి 2018 (13:02 IST)

నేను ప్రజల డైరక్షన్‌లో పనిచేస్తున్నా.. ఏ పార్టీ దర్శకత్వంలో కాదు: పవన్ వార్నింగ్

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో పెనుదుమారం రేపాయి. తెలుగుదేశం పార్టీ నేతలు పవన్ కల్యాణ్‌పై విమర్శనాస్త్రాలు సంధించాయి. ఏపీ సీఎం చంద్

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో పెనుదుమారం రేపాయి. తెలుగుదేశం పార్టీ నేతలు పవన్ కల్యాణ్‌పై విమర్శనాస్త్రాలు సంధించాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు. నారా లోకేష్‌పై పవన్ అవినీతి విమర్శలు చేయడాన్ని బాబు జీర్ణించుకోలేకపోయారు. 
 
ఇంకా బీజేపీ మహా కుట్ర చేసిందని.. పవన్, జగన్‌ను ఎగదోస్తోందని.. పవన్ ఆమరణ దీక్ష తర్వాత ప్రత్యేక హోదా ప్రకటిస్తుందని చంద్రబాబు అన్నారు. ఇందులో భాగంగానే పవన్‌ జగన్‌తో కలిసేందుకు సిద్ధమయ్యారని, వైకాపా ఎంపీ వరప్రసాద్ చెప్పిన వ్యాఖ్యలు కూడా ఇందుకు నిదర్శనమని చంద్రబాబు గుర్తు చేశారు. బీజేపీ డైరక్షన్‌లోనే పవన్ నడుస్తున్నారని.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని మండిపడ్డారు. 
 
ఈ విధంగా తనపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై పవన్ కల్యాణ్ ధీటుగా సమాధానమిచ్చారు. కేంద్రంపై పోరాడే సత్తా మీకు లేదని తనకుందన్నారు. మీలా బొక్కలు (లూప్ హోల్స్), అవసరాలు లేవన్నారు. ఇంకా తనతో తమాషాలు చేయొద్దని.. మీరు తనపై విమర్శలు చేస్తే... అంతకంటే పది రెట్లు బలంగా మాట్లాడాల్సి వస్తుందని పవన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. 
 
అంతేగాకుండా డబ్బు ఖర్చు పెట్టి అధికారంలోకి వచ్చి.. డబ్బు సంపాదనే ధ్యేయంగా రాజకీయ నేతలు పనిచేస్తున్నారని.. నాయకులన్నాక మాటపై నిలబడాలన్నారు. డొంగతిరుగుడు మాటలు కూడదన్నారు. రోజుకో మాట మాట్లాడితే ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారని పవన్ హెచ్చరించారు. ప్రత్యేక హోదా కోసం వెంటనే ఉద్యమం మొదలెట్టే వారిమని.. అయితే పదో తరగతి పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ఉద్యమాన్ని వాయిదా వేశామని.. ఈ ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ మద్దతిచ్చి ప్రజల పక్షాన నిలబడాలని పిలుపునిచ్చారు. 
 
అలాకాకుంటే తాము రోడ్డుపై పడి పోరాటం చేస్తామని పవన్ తెలిపారు. గతంలో జగనేమో తెలుగుదేశం పార్టీ డైరక్షన్‌లో పవన్ పనిచేస్తున్నాడని చెప్పారు. ప్రస్తుతం టీడీపీ బీజేపీ డైరక్షన్‌లో పనిచేస్తుందని చెప్తోందని.. తాను ఏ పార్టీ డైరక్షన్‌లో పనిచేయలేదని.. ప్రజల దర్శకత్వంలో పనిచేస్తున్నానని.. ఈ విషయాన్ని రాజకీయ నేతలు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు.