1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Somireddy Chandramohan Reddy Lashes Out At Pawan Kalyan

'గబ్బర్ సింగ్' కాస్త 'అజ్ఞాతవాసి'లా మారిపోయాడు : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 'గబ్బర్ సింగ్' కాస్త 'అజ్ఞాతవాసి'లా మారిపోయాడటూ సెటైర్లు వేశారు.

Somireddy Chandramohan Reddy
జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 'గబ్బర్ సింగ్' కాస్త 'అజ్ఞాతవాసి'లా మారిపోయాడటూ సెటైర్లు వేశారు. 
 
గుంటూరులో జరిగిన జనసేన నాలుగో వార్షిక సమావేశంలో పవన్ కళ్యాణ్ అధికార తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించిన విషయం తెల్సిందే. దీంతో టీడీపీ నేతలంతా ఎదురుదాడికి దిగారు. ఇందులోభాగంగా, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ శుక్రవారం స్పందించారు. 
 
వైకాపాలాగే మిస్డ్ కాల్ ఇస్తే సభ్యత్వం ఇచ్చేస్తామని పవన్‌ చెబుతున్నారని.. అంటే జగన్‌ను ఆయన అనుసరిస్తున్నారని అనుకోవచ్చా? అని ప్రశ్నించారు. పవన్ తన మనసు ఎవరి మీదైనా పారేసుకుంటారని... ఆ తర్వాత మూడు నాలుగేళ్లకు ఆరేసుకుంటారని ఎద్దేవా చేశారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోరాడతానని చెప్పిన పవన్‌.. ఒక్కసారిగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీరు సెల్వంలా ఎలా మారిపోయారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, లోకేశ్‌ను విమర్శించడానికే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని పెట్టారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
సినిమాలో ఇంటర్వెల్ వరకు హీరోలా ఉండి.. ఆ తర్వాత భిన్నమైన రోల్ పోషించినట్టుగా పవన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పవన్‌ గతంలో తన అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీపై మనసు పారేసుకుని.. తర్వాత ఆరేసుకున్నాడని అన్నారు. నిన్నటివరకు వామపక్ష భావజాలంతో ఉన్న పవన్ ఇప్పుడు పక్షపాత భావజాలానికి మారిపోయారని వ్యాఖ్యానించారు. 
తర్వాతి కథనం
రంగంలోకి దిగిన చంద్రబాబు.. జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రెంట్