శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: గురువారం, 15 మార్చి 2018 (22:01 IST)

పవన్ కళ్యాణ్‌కు అంత సీన్ లేదు... మంత్రి కళా వెంకట్రావు

పవన్ వ్యాఖ్యలపై మంత్రి కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ చంద్రన్న బీమా, పించన్లు వంటి అనేక సంక్షేమ పధకాలను అమలుచేసున్నామన్నారు. ఇలాంటి తరుణంలో బురద జల్లుతాను...కడుక్కోండి అనేలా పవన్ మాట్లాడారని, పవన్ స్పీచ్ వెనుక

పవన్ వ్యాఖ్యలపై మంత్రి కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ చంద్రన్న బీమా, పించన్లు వంటి అనేక సంక్షేమ పధకాలను అమలుచేసున్నామన్నారు. ఇలాంటి తరుణంలో బురద జల్లుతాను...కడుక్కోండి అనేలా పవన్ మాట్లాడారని, పవన్ స్పీచ్ వెనుక ఏదో శక్తి ఉందని, నాలుగేళ్ళలో పవన్ ఏపీలో అవినీతి ఉన్నదని రాతపూర్వకంగా ఏనాడూ ప్రభుత్వానికి తెలుపలేదనేది వాస్తవం కాదా? పవన్‌తో కలవకముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో 120 ఎమ్మెల్యే సీట్లులలో మెజార్టీ వచ్చింది. పవన్, బిజేపితో కలిసిన తరువాత మాకు 106 సీట్లే వచ్చాయని పొత్తు వల్లే అధికారానికి వచ్చామనేది అవాస్తవం. కాబట్టి పవన్ కళ్యాణ్ రాకతో అధికారంలోకి వచ్చామన్నదాంట్లో వాస్తవం లేదని కొట్టి పారేశారు.
 
కొత్త రాష్ట్రానికి కేంద్ర సహాయం అవసరమనే బీజేపీతో పొత్తు పెట్టుకొన్నామనేది వాస్తవమని, 5 కోట్ల ఆంధ్రులు ఆశించిన సహాయం కేంద్రం నుండి ఏపీకి రానందున నేడు హోదాతోపాటు విభజన చట్టంలోని 18 హామీల కోసం తెలుగుదేశం పోరాడుతున్నదని ఈ సమయంలో రాష్ట్ర ప్రయోజనం కోరే పార్టీ ఏదైనా కేంద్రాన్ని టార్గెట్ చేయాలిగానీ సీఎం కుటుంబాన్ని టార్గెట్ చేయరాదు. కానీ నిన్న ఆవిర్భావ సదస్సులో పవన్ పార్టీ విధానాలను ప్రజలకు వివరించకుండా సీఎం కుటుంబంపై నిరాధార నిందలు వేయడం 5 కోట్ల ఆంధ్రులకు అనుమానం కలిగిస్తున్నది. 
 
హోదా ఇవ్వాల్సిన మోడీని ఒక్కమాట అనుకుండా సీఎంపై దాడి కేంద్రీకరించడం బాధాకరం. దేశవ్యాప్తంగా ప్రసిద్ది గాంచిన టిటిడీ దేవస్థానంకు బోర్డు మెంబర్లుగా పక్కరాష్ట్రాల ముఖ్యమంత్రుల అభ్యర్థన మేరకు ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. అప్పటి తమిళనాడు సీఎం జయలలిత కోరితేనే శేఖర్ రెడ్డికి పదవి ఇచ్చాం.. తప్ప మాతో ఏ సంబంధం లేదు శేఖర్ రెడ్డిపై ఆరోపణలు వచ్చిన వెంటనే టిటిడి బోర్డు మెంబర్ నుంచి రద్దు చేశాం. 
 
స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లలో రాయలసీమలోని శ్రీశైలం డ్యామ్ నుండి రాయలసీమకు 145 టీఎంసీలు నీటిని ఎప్పుడైనా ఇచ్చారా అని ప్రశ్నించారు, చంద్రబాబు హయాంలోనే రాయలసీమపై  ప్రత్యేక దృష్టి పెట్టి కరువు ప్రాంతాలకు నీటిని అందించామన్నారు. పట్టిసీమ నిర్మించడం ద్వారా మిగులు జలాలను రాయలసీమకు అందించిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు. రాయలసీమలో కియా, ఫాక్స్ కాన్, షియోమి, ఇసుజి, సెలకాన్ వంటి ప్రతిష్టాత్మకమైన పరిశ్రమలు వచ్చాయన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా కర్నూలులో 1000 మె.వా సౌరవిద్యుత్ పార్క్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రి గుర్తుచేశారు. 
 
రేషన్లో బయోమెట్రిక్ పెట్టి రూ.1000 కోట్లు ప్రజాధనం కాపాడాం, గృహనిర్మాణంలో జియోట్యాగింగ్ పెట్టి అవినీతిని అరికట్టాం, వైయస్ పాలనలో 14.5 లక్షల గృహాలు కట్టకుండానే రికార్డులు సృష్టించి 4 వేల కోట్లు తినేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ నియమించి అక్రమరవాణాని వేల కోట్ల అటవీ సంపదను రక్షించామన్నారు, ఇసుకలో అవినీతిని అరికట్టడానికి అనేక చర్యల్లో భాగంగా ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు, తెలుగుదేశం ప్రభుత్వం అవినీతిని అరికట్టలేదనే పవన్ కళ్యాణ్ అనడం భాదాకరం. అవినీతి ఏదైనా జరిగితే 1100 కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. 2003లో కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అవినీతిలో దేశంలో మొదటిస్థానంలో ఉండేది, మా ప్రభుత్వం అవినీతి వ్యతిరేక పోరాటం వల్ల అవినీతిలో ఏపీ ప్రథమస్థానం నుండి 2015 నాటికే 13వ స్థానానికి తగ్గిందని ఎన్ సిఏఈఆర్ నివేదిక ప్రకటించడం వాస్తవం కాదా? దయచేసి నిరాధార ఆరోపణలు చేయవద్దని పవన్ కళ్యాణ్‌కి మంత్రి కిమిడి కళావెంకట్రావు హితవు పలికారు.