మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 15 మార్చి 2018 (17:57 IST)

పవన్‌కు స్క్రిప్ట్ రాసిచ్చింది ఆయనే.. వాళ్లకు చెడ్డపేరు మాత్రం తీసుకురాను.. లోకేష్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీపై విమర్శలు గుప్పించారు. జనసేన ఆవిర్భావోత్సవ సభలో తెలుగుదేశం పార్టీపై పవన్ చేసిన విమర్శలపై.. టీడీపీ నేతలు ప్రతి విమర్శలు చేస్తున్నారు. మరోవైపు వ

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీపై విమర్శలు గుప్పించారు. జనసేన ఆవిర్భావోత్సవ సభలో తెలుగుదేశం పార్టీపై పవన్ చేసిన విమర్శలపై.. టీడీపీ నేతలు ప్రతి విమర్శలు చేస్తున్నారు. మరోవైపు విజయవాడలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద పవన్ కల్యాణ్ దిష్టి బొమ్మను దహనం చేసేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించారు.  వెంటనే, అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకుని, చెదరగొట్టారు. 
 
ఈ సందర్భంగా ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్‌పై టీడీపీ కార్యకర్తలు విమర్శలు గుప్పించారు. జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చదివిన స్క్రిప్ట్ ఉండవల్లి రాసిచ్చిందేనని ఆరోపించారు. నారా లోకేష్‌తో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
 
మరోవైపు గుంటూరులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలకు ఏపీ మంత్రి లోకేష్ పరోక్షంగా స్పందించారు. తాతగారు.. నాన్నగారిలా గొప్ప పేరు తెచ్చుకుంటానో లేదో తెలియదు కానీ.. వాళ్లకు చెడ్డపేరు మాత్రం తీసుకురానని మంత్రి లోకేష్ అన్నారు.