శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 14 మార్చి 2018 (15:10 IST)

ఉండవల్లి గ్రామ ఓటర్లుగా చంద్రబాబు కుటుంబ సభ్యులు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు ఉండవల్లి గ్రామ ఓటర్లుగా మారిపోయారు. ఈ మేరకు వారి పేర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో ఎక్కించింది.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు ఉండవల్లి గ్రామ ఓటర్లుగా మారిపోయారు. ఈ మేరకు వారి పేర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో ఎక్కించింది. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రకు వచ్చి, ఉండవల్లి కరకట్టపై ఉన్న భవనాన్ని నివాసంగా మార్చుకుని చంద్రబాబు పాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాడేపల్లి మండలం, ఉండవల్లి గ్రామంలో తమను ఓటర్లుగా చేర్చాలని చంద్రబాబు కుటుంబం దరఖాస్తు చేసుకుంది. 
 
దీన్ని పరిశీలించిన ఎన్నికల సంఘం అధికారులు.. సీఎంతో పాటు ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి పేర్లను ఇంటి నంబర్ 3-781/1లో ఉంటున్నట్టు నమోదు చేసి, ఓటరు లిస్టులోకి ఎక్కించారు. దీంతో ఇకపై జరిగే ఎన్నికల్లో చంద్రబాబు ఫ్యామిలీ సభ్యులు ఉండవల్లి గ్రామస్తులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.