శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 14 మార్చి 2018 (14:05 IST)

ప్రియా వారియర్‌లా కన్నుగీటిన జవాన్.. తర్వాత ఏమైందంటే?

''ఒరు అదార్ లవ్'' హీరోయిన్ ప్రియా వారియర్ గురించి అందరికీ తెలిసిందే. తన కనుసైగలతో ఫిదా చేసిన ప్రియా వారియర్ సోషల్ మీడియాలో సెలెబ్రిటీ అయిపోయింది. ప్రియా వారియర్ కన్నుగీటిన వీడియో సోషల్ మీడియాలో వైరల్

''ఒరు అదార్ లవ్'' హీరోయిన్ ప్రియా వారియర్ గురించి అందరికీ తెలిసిందే. తన కనుసైగలతో ఫిదా చేసిన ప్రియా వారియర్ సోషల్ మీడియాలో సెలెబ్రిటీ అయిపోయింది. ప్రియా వారియర్ కన్నుగీటిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ప్రియా వారియర్‌లా కన్నుగీటి ఓ జవాను చిక్కుల్లో పడ్డాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.
 
ప్రియా వారియర్‌లా డీటీఎస్ సిటీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువతిని చూస్తూ కంటితో సైగలు చేశాడు. అంతే యువతి పట్ల అసభ్యంగా కనుసైగలు చేసిన బీఎస్ఎఫ్ జవానును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆర్కేపురంలోని ఎన్జీవోలో పనిచేస్తున్న 24ఏళ్ల యువతి డీటీఎస్‌ బస్సులో మహిళలకు కేటాయించిన సీటులో కూర్చుంది.
 
అదే బస్సులో ప్రయాణిస్తున్న చరణ్ సింగ్ బీఎస్ఎఫ్ జవాన్ ఆమెకు ఎదురుగా నిల్చుని ఉన్నాడు బస్సు ఎక్కినప్పటి నుంచి ఆ యువతిని తదేకంగా చూస్తూ ప్రియా వారియర్‌లా కన్నుగీటాడు. అయితే అతడి చేష్టలతో ఆ యువతికి చిర్రెత్తుకొచ్చింది. అంతే జవాన్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు.