శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: గురువారం, 15 మార్చి 2018 (20:08 IST)

పవన్ సినిమాకు మోడీనే దర్శకుడు... 'కత్తి' కామెంట్లు

పవన్ కళ్యాణ్‌ పైన తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసి ఆ తరువాత ఇబ్బందుల్లో పడి చివరకు సర్దుకున్న కత్తి మహేష్ మళ్ళీ ఆయనపై విరుచుకుపడ్డారు. జనసేన పార్టీ నాలుగవ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై కత్తి మహేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పవన్ కళ్యాణ్‌

పవన్ కళ్యాణ్‌ పైన తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసి ఆ తరువాత ఇబ్బందుల్లో పడి చివరకు సర్దుకున్న కత్తి మహేష్ మళ్ళీ ఆయనపై విరుచుకుపడ్డారు. జనసేన పార్టీ నాలుగవ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై కత్తి మహేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పవన్ కళ్యాణ్‌ మొత్తం సినిమాకు దర్శకుడు నరేంద్ర మోడీనేనన్నారు. సినిమా అంటే నిన్న సభలో మాట్లాడిన మొత్తం స్క్రిప్ట్ అన్నమాట. ఇప్పటివరకు పవన్ సినిమాలు, ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేసిన కత్తి మహేష్ సభపైన, రాజకీయ పార్టీపైన విమర్శలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది. 
 
నిన్న పవన్ మాట్లాడిన మాటలు ఆయనవి కావు. వెనుక నుంచి బిజెపి స్క్రిప్టు అందించింది. ఈ విషయం నేను చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాలపై కనీస అనుభవం ఉన్నావారెవరైనా సరే ఠక్కున చెప్పేస్తారు. పవన్ వ్యాఖ్యలతో టిడిపి నేతలు బాగా ఇరుక్కున్నారు. పత్రికలు, ఛానళ్ళన్నీ పవన్ కళ్యాణ్‌ ప్రసంగం మొత్తాన్ని టెలికాస్ట్ చేయడం ఆశ్చర్యంగా ఉంది.
 
కొన్ని ఛానళ్ళు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నా ఆ ఛానళ్ళు కూడా పవన్ కళ్యాణ్‌ ప్రసంగం ముగిసేంత వరకు.. దాంతోపాటు ముగిసిన తరువాత కూడా పదేపదే అదే వార్తను వేయడం చూస్తుంటే ఆశ్చర్యమనిపిస్తోందంటూ ట్వీట్ చేశారు. అంతటితో ఆగలేదు తాజాగా టిడిపి విమర్శలకు పవన్ కళ్యాణ్‌ కూడా సిద్ధంగా ఉండాలని ట్వీట్ చేశారు కత్తి మహేష్.