శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: గురువారం, 15 మార్చి 2018 (14:25 IST)

నిజాయితీ గల నాయకుడు పవన్... సోము వీర్రాజు పొగడ్తలు, హోదా ఇచ్చేస్తారేమో?

తెలుగుదేశం పార్టీపై గత నెల రోజులుగా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు నిద్ర లేకుండా చేసిన నేతల్లో బిజెపికి చెందిన వారిలో సోము వీర్రాజు ఒకరు. కేంద్రంలోని పెద్దల అండదండలతోనే సోము వీర్రాజు ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారని గతంలో ర

తెలుగుదేశం పార్టీపై గత నెల రోజులుగా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు నిద్ర లేకుండా చేసిన నేతల్లో బిజెపికి చెందిన వారిలో సోము వీర్రాజు ఒకరు. కేంద్రంలోని పెద్దల అండదండలతోనే సోము వీర్రాజు ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారని గతంలో రాజకీయ విశ్లేషకులే చెప్పారు. వారు చెప్పినది నిజమే. టిడిపి-బిజెపిల మధ్య స్నేహబంధం చెడిపోయిన నేపథ్యంలో సోము వీర్రాజు గతంలో చేసిన వ్యాఖ్యలు నిజమేనని స్పష్టమైంది. 
 
సోము వీర్రాజు గతంలో ఎవ్వరికీ పెద్దగా తెలియదు. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీని విమర్శించి హాట్ టాపిక్‌గా మారిపోయారు. నిన్న జరిగిన జనసేన పార్టీ కార్యక్రమంలో టిడిపిపై పవన్ కళ్యాణ్‌ విమర్శలు చేయడం.. బిజెపిని పల్లెత్తు మాట అనకపోవడంతో ఇక సోము వీర్రాజు మొదటగా స్పందించారు. దేశంలో నీతివంతమైన పాలనను నరేంద్ర మోడీ అందిస్తుంటే.. ఎపిలో నిజాయితీ నాయకుడిగా పవన్ కళ్యాణ్‌ ఎదుగుతున్నారని చెప్పారు. దీంతో బిజెపికి జనసేన దగ్గరవుతోందన్న సంకేతాలు స్పష్టంగా అర్థమవుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 
 
2019 ఎన్నికల నాటికి ఎలాగూ పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం పోరాడుతారు కాబట్టి... అదేదో ఇచ్చేసి పవన్ ను ఏపీలో రియల్ హీరోలా భాజపా చేసేస్తుందేమోనన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. చూడాలి ఏం జరుగుతుందో?