శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: గురువారం, 15 మార్చి 2018 (13:50 IST)

పవన్ వ్యాఖ్యలపై వైసిపి నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన జగన్.. ఎందుకు?

జనసేన పార్టీ నాలుగవ ఆవిర్భావ సభలో ఎపిలో ఉన్న అధికార, ప్రతిపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌. వైసిపి పార్టీపై చేసిన విమర్శలు తక్కువే అయినా అధికార తెలుగుదేశం పార్టీని మాత్రం చెడామడా తిట్టేశారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇద

జనసేన పార్టీ నాలుగవ ఆవిర్భావ సభలో ఎపిలో ఉన్న అధికార, ప్రతిపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌. వైసిపి పార్టీపై చేసిన విమర్శలు తక్కువే అయినా అధికార తెలుగుదేశం పార్టీని మాత్రం చెడామడా తిట్టేశారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్‌గా మారుతోంది. పవన్ తెలుగుదేశం పార్టీతో జత కట్టే అవకాశం ఉందని, ఖచ్చితంగా గుంటూరులో జరిగే సభలో ఇదే విషయాన్ని చెబుతారని అందరూ భావించారు. అయితే అదంతా తలకిందులైంది. టిడిపిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తెలుసుకున్న పవన్ కళ్యాణ్‌ ఇక ఆ పార్టీతో కలవాలన్న నిర్ణయాన్ని పూర్తిగా వదులుకున్నట్లు తెలుస్తోంది. అందుకే టార్గెట్ టిడిపిపైనే పెట్టారు.
 
ఇదంతా ఒక ఎత్తయితే ఇక మిగిలింది వైసిపి. నా తండ్రి ముఖ్యమంత్రి కాదు.. నేను ముఖ్యమంత్రి అల్లుడిని కాదు. నా తండ్రి సాధారణ కానిస్టేబుల్. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వ్యక్తిని నేను... అంటూ వైఎస్.జగన్ పైన పరోక్షంగా విమర్శలు గుప్పించారు పవన్. అయితే పవన్ వ్యాఖ్యలపై టిడిపి నేతలు మాత్రం భగ్గుమంటున్నారు కానీ వైసిపి నేతలు మాత్రం అస్సలు ఎక్కడా మాట్లాడటం లేదు. మీడియా ప్రతినిధులు వైసిపి నేతలను ప్రశ్నించినా పవన్ పార్టీ పవన్ ఇష్టం మాకెందుకు... ఆయన వ్యాఖ్యలపై మేమెందుకు స్పందించాలంటూ ప్రశ్నిస్తున్నారు వైసిపి నేతలు. 
 
ఇక్కడే అస్సలు ట్విస్ట్ ఉంది. జగన్ ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలందరికీ స్వయంగా ఫోన్ల ద్వారా ఒకటే చెప్పారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్‌ను విమర్శించవద్దండి.. సర్వే ప్రకారం పవన్ కళ్యాణ్‌ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉంది. ఎలాగో పవన్ కళ్యాణ్‌ తెలుగుదేశం పార్టీపై మండిపడుతున్నారు కాబట్టి ఇక మిగిలింది మనమే. పవన్ మనతో కలిసే అవకాశం కూడా ఉంది. కాబట్టి.. అనవసరంగా నోరు పారేసుకోవద్దండి.. కాస్త ఆలోచించి మాట్లాడండి.. మీడియా ప్రశ్నలతో గుచ్చడం మామూలే. అంతమాత్రాన మీరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడి పవన్‌ను దూరం చేయకండి అంటూ గట్టిగానే చెప్పారట. అందుకే ఇప్పటివరకు ఒక్కరంటే ఒక్క వైసిపి నేత కూడా పవన్ కళ్యాణ్‌ పైన విమర్శలు చేయలేదని తెలుస్తోంది.