శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 22 ఫిబ్రవరి 2018 (09:41 IST)

ఓటుకు నోటు కేసు.. అది చంద్రబాబు వాయిస్ కాదు.. సోమిరెడ్డి

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ స్పందించారు. ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు పాత్రలేదని సోమిరెడ్డి స్పష్టం చేశారు. ఓటుకు నోటు కేసులో వినిప

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ స్పందించారు. ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు పాత్రలేదని సోమిరెడ్డి స్పష్టం చేశారు. ఓటుకు నోటు కేసులో వినిపించే వాయిస్ చంద్రబాబుది కాదని.. ఒకవేళ ఆ వాయిస్ చంద్రబాబుదే అయినా.. అందులో ఎక్కడా తప్పుడు వ్యాఖ్యలు లేవని హైకోర్టు జడ్జే చెప్పారనే విషయాన్ని సోమిరెడ్డి గుర్తు చేశారు. 
 
ఆ వాయిస్‌లో నిష్పక్షపాతంగా, మనస్సాక్షిగా ఓటు వేయమని చెప్పడమే వినబడుతుందే తప్ప.. ఫలానా పార్టీకే ఓటెయ్యమని చెప్పలేదని జడ్జి చెప్పిన విషయాన్ని సోమిరెడ్డి ప్రస్తావించారు. అందుచేత చంద్రబాబుపై ఓటుకు నోటు కేసులో ఇరికించి విమర్శలు చేయడంలో అర్థం లేదన్నారు.
 
ముఖ్యంగా చంద్రబాబుపై విమర్శలు చేసే అర్హత వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డికి వుందా అంటూ సోమిరెడ్డి ప్రశ్నించారు. ఈ దేశంలోని సీనియర్ రాజకీయ నాయకుల్లో బాబు ఒకరని.. విజన్ వున్న వ్యక్తిపై వైసీపీ విమర్శలు గుప్పించడం సరికాదని ఆయన మండిపడ్డారు.