సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (11:26 IST)

మోడీ కాళ్లు మొక్కేందుకు బాబు ఢిల్లీకి వెళుతున్నారు : సీపీఐ జాతీయ నేత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ప్రత్యేక హోదా కోసం ఏపీ ఇప్పటికే అట్టుడుగిపోతుంటే చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ అంటూ వెం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ప్రత్యేక హోదా కోసం ఏపీ ఇప్పటికే అట్టుడుగిపోతుంటే చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ అంటూ వెంపర్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎంతో ముఖ్యమని, హోదా కోసం చంద్రబాబు పోరాటం చేయాలే తప్ప ప్యాకేజీ ఎందుకని ప్రశ్నించారు. 
 
పైకి మాత్రం బాబు గాంభీర్యంగా ప్రకటనలు చేస్తూ మీడియా సమావేశాన్ని పెట్టి కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటానని చెబుతున్నారు, అదేసమయంలో మరోమారు ఢిల్లీకి వెళ్ళి పిల్లిలా మారిపోయి ప్రధాని కాళ్ళు మొక్కి వచ్చేందుకు సిద్ధమవుతున్నారంటూ కె.నారాయణ దుయ్యబట్టారు. 
 
అందరూ కలిసికట్టుగా ముందుకు వెళితే ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకోవడం సాధ్యమేనన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ చూస్తున్నారని, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న మోడీకి తగిన గుణపాఠం నేర్పేందుకు సమయం ఆసన్నమైందన్నారు.