శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 24 ఫిబ్రవరి 2018 (18:09 IST)

గ్రామాల్లో తాగేందుకు నీరు లేదు కానీ మద్యం లేని గ్రామం లేదు : జగన్

రాష్ట్రంలోని గ్రామాల్లో తాగేందుకు నీరు లేదు కాదనీ... మద్యం లేని గ్రామమంటూ లేదనీ వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శనివారం ప్ర‌కాశం జిల్లా క‌నిగిరిలో నిర్వ‌హించిన ర్యాలీలో ఆయ‌న మాట్లాడుతూ, ఎన్ని

రాష్ట్రంలోని గ్రామాల్లో తాగేందుకు నీరు లేదు కాదనీ... మద్యం లేని గ్రామమంటూ లేదనీ వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శనివారం ప్ర‌కాశం జిల్లా క‌నిగిరిలో నిర్వ‌హించిన ర్యాలీలో ఆయ‌న మాట్లాడుతూ, ఎన్నిక‌ల‌కు ముందు మ‌ద్యం గురించి ఏమ‌న్నారు? పిల్ల‌లు మ‌ద్యం తాగి చెడిపోతున్నార‌న్నారు. బెల్టు షాపులు తొల‌గిస్తామ‌ని చెప్పారు.. గ్రామాల్లోనూ మ‌ద్యం దొరుకుతోంది... మంచి నీరు లేని గ్రామాలు ఉన్నాయేమోగానీ, మ‌ద్యం లేని గ్రామం మాత్రం లేదు. ఫోన్ చేస్తే చాలు, ఇంటికే మ‌ద్యం తీసుకొచ్చి ఇస్తున్నారంటూ ఆరోపించారు. 
 
ఇకపోతే, ఏపీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబుని చూసి ఊస‌ర‌వెల్లి కూడా భ‌య‌ప‌డుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఆయ‌న పాల‌న ఎలా ఉందో నాలుగేళ్లుగా చూస్తున్నారని, మోసాలు, అస‌త్యాలతో కొన‌సాగుతోంద‌ని ఆరోపించారు. చంద్ర‌బాబు హ‌యాంలో దేశంలో ఎక్క‌డా లేని అవినీతి మ‌న రాష్ట్రంలో జ‌రుగుతోందని అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క‌రైనా సంతోషంగా ఉన్నారా? అంటూ జగన్ ప్రశ్నించారు.